ప్రతి ఒక్కరు డ్రగ్స్ నిర్మూలన కై పోరాడాలి
యువత డ్రగ్స్ వినియో గానికి దూరంగాఉండాలి
ఎస్సై ప్రమోద్ కుమార్
శాయంపేట నేటిధాత్రి
శాయంపేట మండల కేంద్రంలో అంతర్జాతీయ డ్రగ్స్ దినోత్సవం సందర్భంగా డ్రగ్స్ నిర్మూలకై విద్యార్థుల అవగాహన కొరకు కూడలి వద్ద ర్యాలీ నిర్వహిం చారు.నిషేధిత మత్తుపదా ర్థాలవాడకంఅనేది సమాజానికి పట్టిన చీడపురుగు వంటిది అని ఎస్సై పేర్కొన్నారు తెలిసి తెలియక మత్తు పదార్థాల బానిస బారిన పడటం వల్ల యువత యొక్క బంగారు భవిష్యత్తు నాశనమవు తుందని యువత యొక్క శారీరక మానసిక ఆరోగ్యాన్ని మత్తు పదార్థాలు విచ్ఛిన్నం చేస్తున్నాయని అన్నారు నిషేధిత మత్తు పదార్థాలను వాడటం వల్ల ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరిగి కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయని పేర్కొన్నారు.డ్రగ్స్ వినియోగాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గంజాయి ఓపియం హెరాయిన్ వంటి ఇతర నిషేధిత ట్రాక్స్ సరఫరా ముఠాలను పట్టుకుని కేసులు నమోదు చేయడం జరుగు తుందని పేర్కొన్నారు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను అణచివేయాలి వారి మీద చట్టం ప్రకారం కేసులు నమోదు చేయాలని సూచించారు యువతలో మత్తు పదార్థాలు వినియోగం వల్ల కలిగే అనర్ధాల పట్ల అవగాహన కల్పించేలా విద్యార్థులతో కూడలి వద్ద అవగాహన నిర్వహించారు అనంతరం డ్రగ్స్ నిర్మూలనకు ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమం లో పోలీస్ సిబ్బంది, ప్రజలు విద్యార్థులు పాల్గొన్నారు.