కరెంట్ కష్టాలు లేవు, నీళ్లు కొరత లేదు కేసీఆర్ సంక్షేమంలో ఏలాంటి డోకా లేదు.
టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి
గిరిజన తండాలను గ్రామపంచాయతీ చేసిన ఘనత కేసిఆర్ కి దక్కుతుంది.
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మండలంలోని రాంపూర్ గొల్ల బుద్ధారం,చికెన్ పల్లి,దూదేకులపల్లి దీక్షకుంట నాగారం గ్రామాలలో ప్రజా ఆశీర్వయాత్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య తో కలిసి ఎన్నికల ప్రచార నిర్వహించిన ఎమ్మెల్యే గండ్ర.
స్థానిక నాయకులు ఆధ్వర్యంలో జరిగిన ఈ యాత్రలో భారీగా ప్రజలు పాల్గొని బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి కి స్వాగతం తెలియజేశారు. ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ భూపాలపల్లి రూరల్ గ్రామాలలో రైతులు వ్యవసాయాన్ని ప్రధాన వృత్తిగా చేసుకుని జీవనం గడుపుతుంటారు ,ఒక్కసారి ఆలోచించాలి రైతులకు నాణ్యమైన 24 గంటలు ఇస్తున్న కెసిఆర్ ప్రభుత్వాన్ని వద్దని కేవలం మూడు నాలుగు గంటలు చాలు అంటున్న కాంగ్రెస్ పార్టీ కావాలా ఆలోచించాలి .
రూరల్ గ్రామాల్లో ప్రధాన సమస్య ఉన్న పోడుపట్టాల సమస్యను ఎన్ని అడ్డంకులు ఎదురైనా మొక్కవోని దీక్షలో నిలిచి పోడుహక్కు పత్రాలు కల్పించిన ప్రభుత్వం మనది.
అడవి అధికారుల ఇబ్బందులతో ఎన్నో ఏళ్లుగా ఇబ్బంది పడ్డ రైతుల బాధను తన బాధగా భావించి శాశ్వత విముక్తి రైతుకు కల్పించారు.
తెలంగాణ రాష్ట్రం ఎవరి చేతిలో ఉంటే సుభిక్షంగా సుపరిపాలన సాగుతుందో ప్రజలు ఆలోచన చేసి నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో సరైన నాయకున్ని ఎన్నుకోవాలని కోరారు.
75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో భారతదేశంతో పాటు ఇంకొన్ని దేశాల్లో కూడా స్వతంత్రం వచ్చినప్పటికీ అనుభవం కలిగిన ఎన్నో ప్రభుత్వాలు పరిపాలన సాధించినప్పటికీ అభివృద్ధి చెందిన దేశాలలో వెనుకబడి కి కారణం ఏంటో గ్రహించాలి.
కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఆరు శాతం ఉన్న గిరిజన రిజర్వేషన్లు 12 శాతం పెంచాలని అడిగినప్పటికీ సహకరించని సమయంలో ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో అసెంబ్లీలో చట్టం తీసుకువచ్చి ప్రత్యేక తీర్మానం చేసి ఈరోజు విద్య,ఉద్యోగ అవకాశ రంగాల్లో 12% రిజర్వేషన్ కల్పించారు.
ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టి అమలు చేసిన ఏ ఒక్క పథకాన్ని కూడా మధ్యలో ఆపిన దాఖలాలు లేవు, అన్ని వర్గాల ప్రజలను సమదృష్టితో అమలు చేసే ఏకైక నాయకుడు .
రైతు బంధు పథకం ప్రారంభించినప్పుడు అన్ని పార్టీల వారు నమ్మలేదు అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు రైతుబంధు ఆగదని అన్నారు.
అన్నమాట ప్రకారం రైతుబంధు ఆపడం లేదు,విజ్ఞులైన రైతు సోదరులు ఒక్కసారి ఆలోచించాలి మన ప్రాంతాలలో మిర్చి సాగు అధికంగా ఉంటుంది 4 అంటున్న కాంగ్రెస్ కావాలా, 24 గంటలు ఇస్తున్న కెసిఆర్ కావాలా ఆలోచన చేసి కారు గుర్తుకు ఓటు వేసి కేసిఆర్ గారిని ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి చేద్దాం.
ఎన్నికల సందర్భంలో కొంతమంది వచ్చి నేను రెండుసార్లు ఓడిపోయాను నాకు అవకాశం కల్పించాలని మాట్లాడుతుంటారు
గండ్ర వెంకటరమణరెడ్డి పార్టీ మారాడు కాబట్టి నాకు అవకాశం కావాలని అంటున్నారు, గండ్ర వెంకటరమణారెడ్డి ఒక లక్ష్యం కోసం పార్టీ మారారే తప్ప వేరే దురుద్దేశం లేదు.
ముఖ్యమంత్రి నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీలో చేరినట్లు నుంచి భూపాలపల్లి ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ దాదాపు 90 శాతం పూర్తి చేసిన.
ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలు రాగానే నన్ను తిట్టడమే లక్ష్యంగా పెట్టుకుంటున్నాయి,తప్ప వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళ మేనిఫెస్టో ఏంటో చెప్పలేని దుస్థితిలో ఉన్నారు. నేను చేస్తున్న మంచిని కప్పిపుచ్చే క్రమంలో దూషించడమే పనిగా పెట్టుకుని ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్యే గండ్ర ఆరోపించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ లావణ్య సాగర్ బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజిరెడ్డి పిఎసిఎస్ చైర్మన్ మేకల సంపత్ వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు గ్రామ శాఖ అధ్యక్షులు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు