రేపటి నుండి ప్రతి ఓటరుకు ఓటరు స్లిప్పుల పంపిణీ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

ములుగు జిల్లా నేటిధాత్రి

ములుగు జిల్లా కేంద్రం లో రేపటి నుండి ప్రతి ఓటరుకు ఓటరు స్లిప్పు అందేలా కట్టుదిట్టమైన కార్యాచరణ చేపట్టామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం ఓక ప్రకటనలో తెలిపారు ఎన్నికల నిర్వహణ సందర్భంగా ఓటరు స్లిప్పులు ఎన్నికల కమిషన్ ముందస్తుగా ఓటరు స్లిప్పుల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించిందని పోలింగ్ కేంద్రాల వారిగా ఓటరు స్లిప్పుల ముద్రణ చేయనైనదని వాటిని రేపటి నుండి ఇంటింటికి బిఎల్ ఓ ల ద్వారా పంపిణీనికి పకడ్బందిగా జరిగేలా చర్యలు తీసుకున్నమ న్నారు. ఓటరు స్లిప్పుల పంపిణీ షెడ్యూల్ ను రాజకీయ పార్టీలప్రతినిధులకు ముందస్తుగా తెలియజేయాలని, బిఎల్ఏ లను సైతం ఓటరు స్లిప్పుల పంపిణీలో భాగస్వామ్యం చేయాలని అన్నారు. ఓటరు స్లిప్పుల పంపిణీపై ప్రతి రోజూ నివేదికలు బి ఎల్ ఓ లు సమర్పించాలని, ప్రతి ఒక్క ఓటరుకు తప్పనిసరిగా ఓటరు స్లిప్పు అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఓటరు జాబితా పై వచ్చిన ఫిర్యాదులు, వాటిపై తీసుకున్న చర్యల వివరాల రిజిస్టర్ కట్టుదిట్టంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఓటరు స్లిప్పుల పంపిణీ అంశంలో సందేహాలు ఉంటే రిటర్నింగ్ అధికారికి తెలుపాలని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version