మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
జడ్చర్ల నియోజకవర్గం
రాజపూర్ మండలంలోని ఇబ్రహీంపల్లి గ్రామంలో నేడు బిజెపి కాంగ్రెస్ పార్టీలకు చెందిన 70 మంది యువకులు మహిళలు యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి, ఆధ్వర్యంలో బి ఆర్ ఎస్ పార్టీలో చేరడం జరిగింది.
ఈ సంద్భంగా పార్టిలో చేరిన వారు మాట్లాడుతూ మా గ్రామ అభివృద్ధికి యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి ఇచ్చిన హామీకి నేడు పార్టిలో చేరడం జరిగింది అన్నారు.
ఈ ఎన్నికల్లో బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సి. లక్ష్మారెడ్డి ని కారు గుర్తుకి ఓటు వేసి భారి మెజార్టీతో గెలిపించి, మా గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటాం అని గ్రామస్తులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ ప్రెసిడెంట్ మేకల శ్రీశైలం యాదవ్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు హన్మగళ్ల నర్సింహులు, స్థానిక సర్పంచ్ సభవాట్ బన్నీ, నర్సింహ నాయక్, ఉప సర్పంచ్ మహిపాల్, మండల పార్టీ నాయకులు, యువకులు తదితరులు పాల్గొనడం జరిగింది.