ఆ అరగంటలోనే నగలు ఎత్తుకెళ్లారు..
ఇంట్లోని టీవీ వెనుక కప్‌బోర్డులో 80 గ్రాముల బంగారు నగలు ఉంచారు. 20వ తేదీ చూస్తే ఉన్నాయి. శుక్రవారం ఉదయం చూస్తే లేవు. 20వ తేదీన మధ్యాహ్నం షాపునకు వెళ్లొచ్చిన అరగంట వ్యవధిలోనే దొంగతనం చేసుంటారని భావించారు.
ఇంట్లోని టీవీ వెనుక కప్‌బోర్డులో 80 గ్రాముల బంగారు నగలు ఉంచారు. 20వ తేదీ చూస్తే ఉన్నాయి. శుక్రవారం ఉదయం చూస్తే లేవు. 20వ తేదీన మధ్యాహ్నం షాపునకు వెళ్లొచ్చిన అరగంట వ్యవధిలోనే దొంగతనం చేసుంటారని భావించారు. దీనిపై శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుపతి రూరల్ సీఐ చిన్నగోవిందు(Tirupati Rural CI Chinnagovindu) కథనం మేరకు.. దుర్గసముద్రంలో పత్తి మునెమ్మ, రామచంద్రయ్య దంపతులు ఉంటున్నారు.
ఈ నెల 20న మధ్యాహ్నం 3 గంటలకు రామచంద్రయ్య తన అక్క ఇంటికి వెళ్లారు. 3.30 గంటల సమయంలో మునెమ్మ ఆకు వక్క తీసుకురావడానికి ఇంటికి తాళమేసి, తలుపు పక్కన బ్యాగులో ఆ తాళాలు ఉంచి వెళ్లారు. అరగంట తర్వాత ఆమె తిరిగొచ్చారు. తలుపునకు తాళం వేసుండటంతో ఎలాంటి అనుమానం రాలేదు. శుక్రవారం ఉదయం చూడగా టీవీ వెనుక ఉంచిన దాదాపు 80 గ్రాముల బంగారు ఆభరణాలు కనిపించలేదు.
ఇళ్లంతా వెదికారు. ఎక్కడా కనిపించక పోవడంతో శనివారం రూరల్ సీఐ చిన్నగోవిందును కలసి ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ షేక్‌షావలి కేసు నమోదు చేశారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ ప్రసాద్, సీఐ చిన్నగోవిందు, ఎస్‌ఐ షేక్ షావలి, పోలీసులు, డాగ్, వేలి ముద్రలు నిపుణులు పరిశీలించారు. ఇప్పటికే అవసరమైన సాక్ష్యాధారాలు సేకరించిన పోలీసులకు కేసులో కొన్ని ఆధారాలు లభించినట్లు తెలిసింది.