వరి, పత్తికి, ప్రత్యామ్నాయంగా ఆల్ఫామ్స్ సాగుకు సర్కార్ భారీ సబ్సిడీలు.
ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక లో భాగంగా ఉద్యాన వన శాఖ వారు మంగళవారం కోదాడ మండల పరిధిలోని గుడిబండ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ మందుల నాగయ్య అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ. తెలంగాణను దేశంలోనే ఆయిల్ ఫామ్ హబ్ గా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. 20 26 ఏప్రిల్ నాటికి రాష్ట్రంలో 2.72 లక్షల ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఆయిల్ ఫామ్ తోటలు సాగులో ఉన్నాయి. రాబోయే నాలుగేళ్లలో 10 లక్షల ఎకరాలకు పెంచాలని ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది. మరో 35 వేల హెక్టార్లలో కొత్త తోటలు పెంచేందుకు ప్రాణానికి సిద్ధం చేశారన్నారు. ఈ కార్యక్రమం లో కోదాడ ఎంపీడీవో ఇస్సాక్ హుస్సేన్, ఎంపీవో, హెచ్ ఈవో, సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ,పంచాయతీ సెక్రటరీ, ఉద్యాన వన శాఖ అధికారులు,గ్రామ ప్రజలు రైతులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
