మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం నేటికీ 1000 రోజులు పూర్తి

*ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమానికి మరియు అన్నదాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన

*మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవి రాజు

వేములవాడ, నేటి దాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవి రాజు మాట్లాడుతూ అన్ని దానాల కన్నా అన్నదానం ఎంతో గొప్పదని యాచకుల పేదవారి ఆకలిని తీర్చాలని కరోనా టైం నుండి ఇప్పటి వరకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మై చారిటబుల్ ట్రస్ట్ వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని ఆకలితో అలమటిస్తున్న ఎంతోమంది యాచకుల పేదల ఆకలిని మై చారిటబుల్ ట్రస్ట్ వారు తీరుస్తున్నారని అన్నదాన కార్యక్రమాలే కాకుండా దాతల సహకారంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారికి,నిరుపేద కుటుంబాలకు మై చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏదోరకంగా ఆర్థిక సహాయం మరియు ఇతర సహాయం అందిస్తూ ఆ కుటుంబాలకు బాసటగా నిలుస్తున్నారని మై చారిటబుల్ ట్రస్ట్ వారు మరిన్ని సేవా కార్యక్రమాలు చేసి మరింత పేరు సంపాదించాలని సేవా కార్యక్రమాలను ఎప్పుడు ఇలాగే కొనసాగించాలని వీరికి మా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని,ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు మై చారిటబుల్ ట్రస్ట్ సభ్యులకు వారు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మధు మహేష్,తిరుమల్ గౌడ్, గొంగళ్ళ రవికుమార్,పొలాస రాజేందర్,ప్రతాప నటరాజ్,ప్రతాప సంతోష్,మహమ్మద్ అబ్దుల్ రఫీక్,కొప్పుల హానుమాన్,భస్మాంగి బస్వరాజు,తాళ్లపల్లి ప్రశాంత్,వొడ్యాల వేణు,కళా అశోక్,చల్లా సత్తయ్య,గొండ ప్రసాద్, వీరగొని ఆంజనేయులు,గుండర్స్ మాధవ్, డాక్టర్ శోభారాణి,డాక్టర్ అక్షిత, తదితరులు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version