వైసీపీ కార్యకర్తల వీరంగం.. జగన్ ఫ్లెక్సీకి రక్తాభిషేకం…

వైసీపీ కార్యకర్తల వీరంగం.. జగన్ ఫ్లెక్సీకి రక్తాభిషేకం

 

నల్లజర్ల మండలం చోడవరం గ్రామంలో వైసీపీ కార్యకర్తలు వీరంగం చేశారు. జగన్ ఫ్లెక్సీ వద్ద మేకపోతును నరికి ఆ రక్తంతో జగన్ చిత్రపటానికి అభిషేకం చేశారు. మేకపోతు తలకాయ పట్టుకుని వీరంగం సృష్టించారు.

పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం చోడవరం గ్రామంలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. నిన్న (శుక్రవారం) రాత్రి జగన్ మోహన్ రెడ్డి చిత్రపటం ఉన్న ఫ్లెక్సీ వద్ద మేకపోతును నరికి, ఆ రక్తంతో వైఎస్ జగన్‌కు రక్తాభిషేకం చేశారు. ఓ కార్యకర్త మేక తల పట్టుకుని వీరంగం సృష్టించాడు. జగన్ పుట్టినరోజు (డిసెంబర్ 21) జరిగి ఆరు రోజులు దాటినా, ‘2029లో గంగమ్మ జాతర రప్ప రప్ప’ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version