వలసలు నివారించేందుకు ప్రవేశపెట్టిన దే ఉపాధి హామీ
సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో వలసలు నివారించేందుకు ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పనులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ కట్కూరి రాధిక- శ్రీనివాస్. ఉప సర్పంచ్ ఓరుగంటి కృష్ణ, పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఫీల్డ్ ఛానల్ పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధి హామీ పనులకు సకాలంలో వచ్చి కొలతల ప్రకారం పనులు చేయాలన్నారు. ఉపాధి హామీ కూలీలు ఐరిష్ విధానంలో హాజరుకావాలని ప్రతిరోజు రెండు పర్యాయాలు హాజరు ఉంటుందని, తెలిపారు. ఉపాధి పనిచేసే వారికి ప్రతిరోజు వేతనం 307 రూపాయలు కూలి పడే విధంగా చూడాలని ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీదేవి కి ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి విజేందర్. ఈసీ రాజు టెక్నికల్ అసిస్టెంట్. సంపత్ రైతులు. సిరిగినేని బాబురావు , తడక సాంబయ్య , వైనాల వెంకటేశ్వర్లు యువజన నాయకులు మచ్చిక రక్షిత్. శివ , రావుల సురేష్ పాల్గొన్నారు
