సూత్రధారులు, పాత్రధారులు డాక్యుమెంట్ రైటర్లే!

`అర్హత లేని భూమికి రిజిస్ట్రేషన్ చేయించే ఘానాపాఠిలే!

`అన్ని రకాల తప్పుడు పత్రాలు సృష్టించేది డాక్యుమెంట్ రైటర్ లే?

`గ్రామపంచాయతీకి సంబంధం లేకుండా ఇంటి నెంబర్లు సృష్టించడం లో దిట్టలే!

`నేరుగా డిపిఓ కార్యాలయం నుంచే పని చేయించునేంత సమర్ధులే!

`10 నిమిషాల్లో ఇంటి నెంబర్ ఇప్పించగల నేర్పరులే!

`అన్ని రకాల అనుమతులకు ఆద్యులు డాక్యుమెంట్ రైటర్ లే!

`డాక్యుమెంట్ కి తయారీ బేరాలు కుదిరిచ్చేదంతా వాళ్లే!

`రేట్ ఫిక్స్ చేసి చెప్పే నిర్ణయాలు చేసేది డాక్యుమెంట్ రైటర్ లే!

`రిజిస్టార్లకు డబ్బులను ఆశగా చూపించేది డాక్యుమెంట్ రైటర్లే!

`డాక్యుమెంట్ అంతా క్లియర్ అని రిజిస్ట్రార్ లను నమ్మించేది వాళ్లే!

`ఎక్కడా తప్పు దొర్లకుండా చూసుకునే బాధ్యత నాది అని నమ్మించేది వాళ్లే!

`రిజిస్ట్రేషన్ శాఖలో తప్పులు ఎలా చేయాలో అధికారులకు పాఠాలు చెప్పేది వాళ్లే!

`ఏ శాఖ నుంచి ఎవరితో ఏ తప్పుడు అనుమతి పత్రాల సృష్టి కర్తలు కూడా వాళ్లే!

`రిజిస్ట్రార్లు కుర్చీ కదలకుండా అన్నీ సమాకూర్చేది డాక్యుమెంటు రైటర్లే!

`డిపిఓ లో ఒక అధికారికి జిపే ద్వారా డబ్బులు పంపించి పది నిమిషాల్లో ఇంటి నెంబర్లు తెప్పించే శక్తిమంతులు డాక్యుమెంట్ రైటర్లే!

`డాక్యుమెంట్ రైటర్ల ఆదాయం అంతా ఇంత కాదు!

`అందుకే రిజిస్ట్రార్ తమ్ముళ్లు,భార్యలు, బావమరుదులు బంధు వర్గం డాక్యుమెంట్ రైటర్లే!

`ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రక్తసంబంధీకులు డాక్యుమెంట్ రైటర్లుగా ఉండొద్దు!

`బినామీలను పెట్టి కార్యాలయాలు నడిపిస్తున్నారు.

`తనిఖీ అధికారులు ఎవరొచ్చినా ఉద్యోగులమని చెప్పుకుంటారు!

`ఏసీబీ అధికారులకు రిజిస్ట్రేషన్ శాఖలపై డాక్యుమెంట్ రైటర్ల ప్రమేయం తెలిసినా పట్టించుకోరు!

`ప్రయివేట్ వ్యక్తులుగానే భావించి వదిలేస్తుంటారు!

`ప్రభుత్వ కార్యాలయాల, గ్రామపంచాయతీల రబ్బర్ స్టాంపులు కూడా డాక్యుమెంట్ రైటర్ల వద్ద గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లా లో దొరికాయి!

`అయినా ప్రైవేట్ వ్యక్తులు అనే కారణం తో చర్యలు వీరిపై తీసుకోలేదు.

`అదే డాక్యుమెంటు రైటర్లకు వరంగా మారింది.

`ఎంత దోపిడీ చేసినా పట్టుకొరనే దైర్యం పెరిగింది.

`డాక్యుమెంటు రైటర్ల విచ్చలవిడి అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది!

`గతంలో ఒక పోలీస్ అధికారి ప్రైవేటు డ్రైవర్ వద్ద కూడా డబ్బులు దొరికినందుకు అధికారితో పాటు ప్రైవేట్ డ్రైవర్ ని కూడా జైలుకు పంపించారు.

`అదే విధంగా డాక్యుమెంట్ రైటర్లను కూడా జైలుకు పంపించాలి!

`ప్రభుత్వం కూడా ఏసీబీ అధికారులకు పూర్తిగా స్వేచ్ఛను ఇవ్వాలి

`సూత్రధారులు పాత్రధారులైన డాక్యుమెంట్ రైటర్లపై నిఘా పెట్టాలి!

హైదరాబాద్, నేటిధాత్రి:

రిజిస్ట్రేషన్ కార్యాలయం అంటేనే చాలు ముందే ఒక అనుమానం మొదలౌతుంది. అడుగు పెడుతుండగానే గుండె దడ మొదలౌతుంది. ఆసుపత్రిలో చేరే పేషెంటుకు కూడా అంత భయం వుండదు. ఎంత బిల్లు వేస్తారో అన్న దిగులుండదు. కాని రిజిస్ట్రేషన్ కార్యాలయంలోకి అడుగు పెడుతుంటేనే గుండెను అదిమి పట్టుకొని వెళ్లాల్సిన దుస్తితి ఎదురౌతుంది. ఎలాంటి రిజిస్ట్రేషన్ అయినా సరే ఎంత కొంత ముట్ట జెప్పడమనే మాటే వుండదు. వాళ్లు ఎంత చెబితే అంత ముట్ట జేప్పితేనే పని పూర్తవుతుందన్న భయం ముందే వెంటాడుతుంది. స్ధలం కొనేప్ప్పుడున్నంత ఆనందం రిజిస్టర్ చేయించుకునేందు ముందు వుండదు. అంతలా భయపెట్టే శాఖ అంటే ముందుగా చెప్ప్పుకునేది రిజిస్ట్రేషన్ శాఖ. అయితే ఇక్కడ కూడా తిమింగలాలే కాదు, చుట్టూ గద్దలు, రాబంధుల రూపంలో కూడా ఇంకా కొంత మంది వుంటారు. వాళ్లే డాక్యుమెంటు రైటర్లు. పైకి ఎంతో సౌమ్యంగా కనిపిస్తారు. కాని వాళ్ల హంగూ ఆర్భాటం, దర్పం చూస్తే రిజిస్ట్రార్ కన్నా ఎక్కువ వుంటుంది. వాళ్ల హడావుడి చూస్తే అక్కడే గుండె ఆగిపోయినంత పనౌతుంది. పని కావాలంటే ముందు వాళ్లను ప్రసన్నం చేసుకోవాలి. వాళ్లే డాక్యుమెంటు రైటర్లు. అర్హత లేని భూములైనా సరే వారి చేతుల్లోకి వెళ్తే పనౌతుంది. ఎలాంటి భూమినైనా రిజిస్ట్రేషన్ చేయించగలరు. అంతటి ఘనాపాఠీలు వాళ్లు. ఎలాంటి తప్ప్పుడు పత్రాలు సష్టించాలన్నా వాళ్లే దిక్కు. అడ్డదారిలో భూములు కొనుగోలు చేసుకునే వాళ్లు, ఎంతైనా ఇస్తారు. ఎంతకైనా తెగిస్తారు. కాని రూపాయి, రూపాయి పోగేసుకొని మోసపోయిన అమాయకులు కూడా డాక్యుమెంటు రైటర్లుకు బలి కావాల్సిందే. వాళ్లు అడిగినంత ముట్ట చెప్పాల్సిందే. రిజిస్ట్రేషన్ కార్యాయాల్లో కనిపించని పెత్తనమంతా వాళ్లదే. వాళ్లు నిమిత్త మాత్రులుగానే కనిపిస్తారు. కాని చేసేదంతా వాళ్లే. కార్యక్రమాలు చక్కదిద్దేది వాల్లే? సహజంగా గ్రామ శివారు ప్రాంతాలలో ఎవరైనా సరే భూమి కొంటే ఆ ఇంటి నెంబర్ గ్రామ పంచాయితీ ఇవ్వాలి. కాని రిజిస్ట్రేషన్‌కు వచ్చిన వాళ్లు గ్రామ పంచాయితీకి వెళ్లాల్సిన అవసరం లేదు. రాదు..ఒక వేళ వెళ్లినా అక్కడ పని కాదు. కారణం డాక్యుమెంటు రైటర్లు. గ్రామ పంచాయితీకి సంబంధం లేకుండానే ఇంటి నెంబర్లు ఇవ్వగలరు. అంత సమర్ధులు డాక్యుమెంటు రైటర్లు. గ్రామ పంచాయితీకి కనీసం సమాచారం ఇవ్వకుండానే నేరుగా డిపివో కార్యాలయం నుంచి ఇంటి నెంబర్లు పది నిమిషాల్లో సంపాదిస్తారు. వారికి ఇవ్వాల్సింది ఇచ్చేస్తారు. రిజిస్ట్రేషన్‌కోసం వచ్చినవారి నుంచి వసూలు చేస్తారు. ఎలాంటి భూములకైనా సరే రిజిస్ట్రేషన్‌లు చేయించగల సమర్ధులు. రిజిస్ట్రార్లను మాయ చేయగలరు. ఎలాంటి డాక్యుమెంట్లనైనా మాయం చేగలరు. రిజిస్ట్రేషన్ కార్యాయాలల్లో జరిగే ప్రతి పనిలో పెత్తనం చేస్తారు. డాక్యుమెంట్లకు రేట్లు కూడా వాళ్లే ఫిక్స్ చేస్తారు. ఇక్కడ కూడా రిజిస్ట్రార్‌కు సంబంధం లేకుండా చూసుకుంటారు. రిజిస్ట్రార్ చేతికి మట్టి అంటకుండా చూసుకుంటారు. ఒక వేళ రిజిస్ట్రార్‌లు ఒప్ప్పుకోకపోతే వాళ్లను సైతం ఇరికించేందుకు డాక్యుమెంటు రైటర్లు వెనుకాడరు. అందుకే జనం డాక్యుమెంటు రైటర్ల మాటే వినాలి. ఆఖరుకు రిజిస్ట్రార్లు కూడా డాక్యుమెంటు రైటర్లు ఆడమన్నట్లే అడాలి. రిజిస్ట్రార్లకు డబ్బుల ఆశ కల్పించేంది వాళ్లే. రిజిస్ట్రార్లు జేబులు నింపేది వాల్లే. డాక్యుమెంటు అంతా క్లియర్ అని నమ్మించేది డాక్యుమెంటు రైటర్లే. డాక్యుమెంటు రైటర్లు మాటలు నమ్మి, రిజిస్ట్రార్లు సంతకాలు చేయాల్సిందే! ఎక్కడా తప్ప్పు దొర్లకుండా చూసుకునేది వాల్లే..రిజిస్ట్రార్లు ఏసిబికి చిక్కకుండా కాపాడేది కూడా డాక్యుమెంటు రైటర్లే. ఏ రిజిస్ట్రేషన్ చేస్తే ఎంత డబ్బు వస్తుందో రిజిస్ట్రార్లకు చెప్పేది కూడా వాళ్లే. అందుకోసం అవసరమైన తప్ప్పుడు దవపత్రాలు సంపాదించేది వాళ్లే. కాని పక్షంలో తప్ప్పుడు దవపత్రాలు సష్టించేంది కూడా డాక్యుమెంటు రైటర్లే. డిపిఓలకు జిపే ద్వారా డబ్బులు పంపించి ఇంటి నెంబర్లు తెచ్చేది వాల్లే. డాక్యుమెంటు రైటర్లే కదా? వారి ఆదాయం ఎంతంటుంది, చిన్న జీవితాలు అనుకుంటే పొరపాటు పడ్డట్లే. రిజిస్ట్రార్లతో సమానంగా ఆదాయం సమకూర్చుకునేది డాక్యుమెంటు రైటర్లే. అందుకే ఈ ఆదాయ వనరులు తెలసిన కొంత మంది రిజిస్ట్రార్లు కార్యాలయంలో డాక్యుమెంటు రైటర్లుగా బంధువులను ఏర్పాటు చేసుకుంటారు. దగ్గరి బంధువులకు రిజిస్ట్రార్లు ఆ బాద్యతలు అప్పగిస్తారు. స్వామి కార్యం, స్వకార్యం రెండూ డాక్యుమెంటు రైటర్లు చేసిపెడతారు. రిజిస్ట్రార్లు చిక్కుల్లో పడకుండా చూసుకుంటారు. అందుకే బంధువులను ఎంచుకుంటారు. కార్యాలయాల్లో తిష్టవేయిస్తారు. బినామీలుగా పెట్టుకొని రిజిస్ట్రార్లు ఆస్తులు కూడబెట్టుకుంటారు. నిత్య సంతర్పణలు చేయించుకుంటారు. లక్షల ఆదాయం సంపాదిస్తుంటారు. సహజంగా ఏసిబి అదికారులకు ఈ విషయాలు పూర్తిగా తెలియవు. వాళ్లంతా ప్రైవేటు వ్యక్తులనుకుంటారు. డాక్యుమెంట్లు రాసి, ఎంతో కొంత తీసుకుంటారని అనుకుంటారు. కాని అసలు సూత్రదారులు, పాత్రదారులు వాల్లే అని తెలియదు. అందుకే రిజిస్ట్రార్లు పట్టుబడిన సమయంలో డాక్యుమెంటు రైటర్లు అక్కడే వున్నా, వాళ్లను వదిలేస్తుంటారు. ప్రభుత్వానికి సంబంధించి, వివిధ శాఖలకు సంబంధించిన రబ్బరు స్టాంపులు ప్రైవేటు వ్యక్తులు కలిగి వుండడం నేరం. కాని డాక్యుమెంటు రైటర్ల వద్ద ఏ రబ్బరు స్టాంపు కావాలన్న దొరుకుతుంది. అందుకే ఆయా శాఖలకు సంబంధం లేకుండా, రికార్డులు లేకుండా నేరుగా రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో రబ్బరు స్టాంపులు డాక్యుమెంటు రైటర్ల వద్ద దొరికాయి. అయితే ప్రైవేటు వ్యక్తులనే భావనతో ఏసిబి అదికారులు వాళ్లను పట్టించుకోరు. ఇదే డాక్యుమెంటు రైటర్లుకు వరంగా మారింది. రిజిస్ట్రార్‌కు సంబంధించిన అన్ని రకాల లవాదేవీలన్నీ డాక్యుమెంటు రైటర్లే చేసి పెడతారు. ఎంత దోపిడీ చేసినా ఎవరూ పట్టించుకోరనే ధైర్యం వారిలో మరింత పెరిగిపోయింది. అందుకే రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో విచ్చలవిడి అవినీతికి అంతూ పొంతు లేకుండాపోయింది. గతంలో ఏసిబి అదికారులు పట్టుకున్న పోలీసులకు చెందిన ప్రైవేటు డ్రైవర్లను కూడా అదుపులోకి తీసుకున్న సందర్బాలున్నాయి. అలాగే ఇక్కడ కూడా డాక్యుమెంటు రైటర్లను కూడా అదుపులోకి తీసకోవాలి. రిజిస్ట్రార్లను విచారించినట్లే విచారించాలి. డాక్యుమెంటు రైటర్ల మీద కూడా ఏబిసి నిఘా పెట్టాలి. అప్ప్పుడుగాని ఎంతో కొంత అవినీతికి అడ్డు కట్ట పడదు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version