సిఐటియు జిల్లా జాయింట్ సెక్రటరీ ఆకుదారి రమేష్.
భూపాలపల్లి నేటిధాత్రి
సిఐటియు జిల్లా జాయింట్ సెక్రటరీ ఆకుదారి రమేష్ విలేకరుల సమావేశం నిర్వహించారు అనంతరం మాట్లాడుతూ
కేంద్ర బిజెపి ప్రభుత్వం తలపెట్టిన బొగ్గు బ్లాక్లి వేలను రద్దు చేయాలని రాష్ట్రంలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ సింగరేణికి కేటాయించాలని తెలంగాణ రాష్ట్రంలోని కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘం సిఐటియు డిమాండ్ చేస్తూ, కేంద్రంలోని బిజెపి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే పదో విడత బొగ్గు బ్లాక్ల వేలం ప్రక్రియ ప్రారంభించింది. తెలంగాణకు చెందిన బిజెపి ఎంపి జి. కిషన్ రెడ్డి గారికి గనుల శాఖ కేటాయించిన మరుక్షణమే మీరు హైదరాబాదులో వేలం ప్రక్రియ ప్రారంభించడం విస్మయం కలిగిస్తున్నది. ఇందులో గోదావరి పరివాహక ప్రాంతంలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాకును కూడా వేలం పెట్టడాన్ని తెలంగాణ కార్మిక వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నది. కేంద్రం రాష్ట్రంలోని బొగ్గు బ్లాకులను సింగరేణి కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాము. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణికి బొగ్గు బ్లాగులు వచ్చే విధంగా కేంద్రంతో పోరాడాలని డిమాండ్ చేస్తున్నాము. సింగరేణి కేంద్ర రాష్ట్రాలకు డేవిడెన్స్ పనుల రూపంలో ప్రతి సంవత్సరం సుమారు రూ.8,000 కోట్లు చెల్లిస్తున్నది. బిజెపి పరిపాలించిన పది సంవత్సరాల కాలంలో రూపాయలు 49 వేల కోట్లకు పైగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లించింది. ఇలాంటి సంస్థను ప్రైవేటు పరం చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తున్నది. మైన్స్ మినరల్ (డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్స్ ) యాక్టు లోని సెక్షన్ 17 (ఏ ) ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ సమస్యలకు బొగ్గు బ్లాగులు కేటాయించాలి. కానీ కేంద్రం ప్రభుత్వరంగ సంస్థ సింగరేణికి బొగ్గు బ్లాగులు కేటాయించకుండా వేలంలో సింగరేణి కూడా పాల్గొనాలని చెబుతున్నది.గతంలో వేలంలో బొగ్గు బ్లాకులు కూడా ప్రైవేట్ వారికి ఇవ్వడం వలన నష్టపోయాము. సింగరేణి డబ్బులతో కొత్తగూడెం నుండి సత్తుపల్లి కి రూ.1,000 కోట్లతో రైల్వే ట్రాక్ కోసం ఖర్చుపెట్టిన ఎక్స్ప్లోరేషన్ పేరుతో సింగరేణికి కేటాయించకుండా వేలంలో పెట్టారు. కేంద్ర ప్రభుత్వం నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ లొ భాగంగా బొగ్గు బ్లాక్ లను ప్రైవేటీకరణ ద్వారా 2025 నాటికి సుమారు 28,747 వేల కోట్లు సంపాదించాలని చూస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం కూడా జెన్కో ట్రాన్స్కో ల ద్వారా బకాయిలు రూపాయలు 30 వేల కోట్లు సింగరేణి చెల్లించకుండా ఉన్నది. తెలంగాణకు సింగరేణి కొంగుబంగారంగా ఉంది. ఒకనాడు లక్ష మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి కల్పించింది కాంట్రాక్టు పద్ధతిని అమలు చేశాక నేటికీ 40 వేల మంది పర్మినెంట్ ఉద్యోగులు 20వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తున్న సింగరేణి సంస్థను కాపాడుకోవాలని భూపాలపల్లి లోని ప్రతి ఒక్క సింగరేణి బావి వద్ద సిఐటియు నాయకులు సింగరేణి కార్మికులను కలిసి కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు వెలిశెట్టి రాజయ్య, గడప శేఖర్, సుభాన్, రఘు, ప్రభాకర్, మహేందర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.