కరక గూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి..
ఈరోజు కరకగూడెం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జననేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు స్వర్గీయ డాక్టర్.వైయస్ రాజశేఖర్ రెడ్డిజయంతి సందర్భంగా చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించిన మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్
ఈ సందర్భంగా మాట్లాడుతూ,
ప్రజల గుండెల్లో ఎప్పుడు చిరస్థాయిగా ఉండిపోయే వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని అన్నారు..
ప్రతి పేదవాడి గుండె చప్పుడు బాగా తెలిసిన వ్యక్తి, తెలుగు బ్రాండ్ అంబాసిడర్ ఆయన, తెలుగు జాతి ఉన్నంతకాలం చరిత్రలో రాజశేఖర్ రెడ్డి నిలిచిపోతారన్నారు..
ఇందిరమ్మ తర్వాత ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా రెండుసార్లు బాధ్యతలు స్వీకరించి తన సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో ఇప్పటికి చెరగని ముద్ర వేసుకున్నారు. సుదీర్ఘ పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను తెలుసుకొని ఆ కష్టాలనే సంక్షేమ పథకాలుగా రూపుదిద్ది ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకొని
ప్రజలకు గుండె చప్పుడు అయ్యారన్నారు..
పథకాల విషయానికి వస్తే ఆరోగ్యశ్రీ నుంచి 108 వరకు, ఫీజు రీయింబర్స్మెంట్ నుంచి రుణమాఫీ వరకు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పథకాలు ప్రవేశపెట్టారు..
ఆ మహానాయకుడు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ప్రవేశపెట్టిన పథకాలు మాత్రం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయని, ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శమయ్యాయి ప్రశంసలు కూడా అందుకుంటున్నాయని తెలియజేశారు..
ఈ కార్యక్రమంలో
మండల నాయకులు అత్తే సారయ్య , భూక్య అర్జున్, బరపటి వెంకన్న, పూజారి వెంకన్న , ఏళ్ళబోయిన సత్యం ,దొంతూ మల్లయ్య , రాజేందర్ , జాడి శ్రీనివాసరావు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..