# సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోరబోయిన కుమారస్వామి
నర్సంపేట,నేటిధాత్రి :
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మతోన్మాద బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోరబోయిన కుమారస్వామి పిలుపునిచ్చారు.ఆ పార్టీ నర్సంపేట మండల కమిటీ సమావేశం పట్టణంలో బుర్రి ఆంజనేయులు అద్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కొరబోయిన కుమారస్వామి మాట్లాడుతూ గత 10సంత్సరాలుగ దేశాన్ని పాలిస్తున్న ప్రధాని మోడి నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం దేశ సంపదను కారుచౌకగా కార్పొరేట్ మిత్రులైన ఆదాని అంబానీలకు దోచి పెడుతూ ప్రజలపై బారాలు మోపుతున్నాడని ఆరోపించారు. అధికారంలోకి వచ్చే ముందు దేశంలో నిరుద్యోగ సమస్యను తగ్గిస్తానని, ప్రతీ సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన మోడీ నేడు ప్రభుత్వ రంగ సంస్థలు ప్రవేట్ పరం చేశాడని పేర్కొన్నారు.ఈ సమావేశంలో మండల నాయకులు శ్రీనివాస్ రెడ్డి,ఎస్కే అన్వర్, కత్తి కట్టయ్య, పెండ్యాల సారయ్య, కమతం వెంకటేశ్వర్లు, సూరయ్య, భసిక మొగలి,రుద్రారపు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.