వేములవాడ, నేటి ధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ తెలంగాణ రాష్ట్రలో అత్యంత ఎక్కువజానాభ కల్గియున్న మున్నూరుకాపులు ఇట్టి సామాజిక వర్గానికి మున్నూరుకాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వంలో పది సంవత్సరాలుగా పోరాటం చేయడం జరిగింది కాని నేటివరకు కార్పొరేషన్ ను ఏర్పాటు చేయలేకపోయారు మొన్నటి క్రొత్తగా వచ్చిన ప్రభుత్వం మేనిఫెస్టోలో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పిన సందర్భంగా మున్నూరుకాపు రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య ఆధ్వర్యంలో అన్ని జిల్లాల అధ్యక్షులతో కలిసి ఆది శ్రీనివాస్ వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ని,బీసీ శాఖమంత్రి వర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ కలిసి కార్పొరేషన్ గురించి అడుగుగ వెంటనే స్పందించి తప్పకుండా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాము అని హామీ ఇచ్చారు ఈ సందర్బంగా మంత్రి కి మా వేములవాడ శాసనసభ్యులు శ్రీ ఆది శ్రీనివాస్ ప్రభుత్వ విప్ కి వేములవాడ పట్టణ మున్నూరుకాపు సంఘం తరుపున కులబాందవుల తరుపున ప్రత్యేక హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయడమైనది అదే విధంగా వేములవాడ పట్టణంలో గత పది సంవత్సరాలనుండి నడిపిస్తున్న మున్నూరుకాపు నిత్యాన్నాసత్రం 11వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్బంగా సత్రం ట్రస్ట్ సభ్యులు 11వ వార్షికోత్సవ వేడుకలను తేదీ 4/2/2024 ఆదివారం రోజున ఉదయం 10 గంటలకు ఘణంగా నిర్వహిస్తున్నారు ఇట్టి వార్షికోత్సవ వేడుకల్లో కుల బాంధవులందరు అధిక సంఖ్యలో రావలసిందిగా కోరారు.ఇట్టి కార్యక్రమంలో మున్నూరుకాపు సంఘం అధ్యక్షులు బింగి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు కోయినేని బాలయ్య, ఉప్పుల దేవరాజు, వరి లక్ష్మీనారాయణ, నామాల శేఖర్ , సార శ్రీనివాస్ లు పాల్గొన్నారు.