ఘనంగా పులమాలతో దార్శనిక నేత శ్రీ రాజీవ్ గాంధీ గారి జయంతి వేడుక.
జహీరాబాద్ నేటి ధాత్రి:
మొగడంపల్లి మండలంలోని మర్జంపల్లి తండాలో మహిళా కాంగ్రెస్ మండల ముఖ్య నాయకురాలు మారుని బాయి ఆధ్వర్యంలో మహిళా నాయకురాళ్ల సమావేశం.ఈ కారిక్రమానికి ముఖ్య అతిథిగా విచ్ఛేసిన జహీరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా మాట్లాడుతూ భారత మాజీ ప్రధాన మంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ మహిళల ప్రాముఖ్యత మరియు వారి సాధికారత గురించి అనేక సందర్భాల్లో మట్లాడుతు ఏదైనా సామాజిక వ్యవస్థను నిర్మించడంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తారని, విద్య మరియు ఉపాధికి మహిళలకు తగిన అవకాశాలు కల్పించాలని, సామాజిక, రాజకీయ, ఆర్థిక మరియు సాంస్కృతిక జీవితంలో మహిళల పూర్తి భాగస్వామ్యం కోసం మరియు మహిళా సాధికారత వైపు ఆయన ప్రయత్నాలకు నాయకత్వం వహించారు.రాజీవ్ గాంధీ బడుగు బలహీన వర్గాల కోసం తపిస్తూ, పంచాయతీ రాజ్ వ్యవస్థల అభివృద్ధికి సంస్కరణలు చేపట్టడంతో గ్రామాలకు ఆర్థిక స్వావలంబన కల్పించడమే కాకుండా స్థానికసంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు మహిళలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు రిజర్వేషన్లు కూడా కల్పించడమైనదని అన్నారు.
ఈ కారిక్రమంలో భారీ ఎత్తున మహిళలు కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.