శంకరపల్లి మండల కేంద్రంలో విద్యా సంస్థల బంద్ విజయవంతం
చేవెళ్ల డివిజన్ ఎస్ఎఫ్ఐ కార్యదర్శి బేగరి అరుణ్ కుమార్ నేతృత్వంలో నిరసన
శంకర్పల్లి, నేటిధాత్రి:
చేవెళ్ల డివిజన్ ఎస్ఎఫ్ఐ కార్యదర్శి బేగరి అరుణ్ కుమార్ నేతృత్వంలో చేపట్టిన విద్యాసంస్థల బంద్ విజయవంతంగా ముగిసింది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులంతా బంద్‌కు మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా కార్యదర్శి అరుణ్ మాట్లాడుతూ, ఖాళీగా ఉన్న టీచర్, MEO, DEO పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని, అలాగే ఇంటర్మీడియట్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అదే విధంగా
పెండింగ్ స్కాలర్షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదల
అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలకు మౌలిక సదుపాయాలు మరియు అవసరమైన నిధుల కేటాయింపు
పెండింగ్ మెస్ బిల్లులు, కాస్మెటిక్ ఛార్జీల విడుదల
అద్దె భవనాల్లో నడుస్తున్న వసతి గృహాలకు స్వంత భవనాల నిర్మాణం
గురుకులాల్లో అమలు చేస్తున్న అశాస్త్రీయ సమయపాలనకు విరుద్ధంగా చర్యలు
బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద పెండింగ్ బకాయిల విడుదల
ఎయిడెడ్ పాఠశాలలకు పెండింగ్ నిధుల మంజూరు
విద్యార్థులకు RTC ఉచిత బస్ పాసుల అందుబాటులోకి తేవడం.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న ప్రిన్సిపాల్ మరియు లెక్చరర్ పోస్టుల భర్తీ
NEP-2020ను తెలంగాణలో అమలు చేయకుండా అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేసారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ శంకరపల్లి నాయకులు హనుమంత్, నవీన్, వరుణ్, వరుణ్ తేజ, అభిరామ, అల్తాఫ్, రాము, విష్ణువర్ధన్, అరవింద్, ఆకాష్, ఋషి, చరణ్ తేజ తదితరులు పాల్గొన్నారు.