మే 2 నుంచి మక్కజొన్నల కొనుగోళ్ళు తాత్కాలిక నిలిపివేత
నర్సంపేట మార్కెట్ యార్డుకు మక్కజొన్నలు తీసుకురావొద్దు
యార్డులో 1.30 లక్షల బస్తాలు నిల్వ, స్థలం సరిపోక సమస్య
నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్
నర్సంపేట, నేటిధాత్రి:
నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని మార్కెట్ యార్డులో మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయవలసిన మక్కజొన్న బస్తాల నిల్వ సమర్థాన్ని మించి దీంతో కొనుగోళ్లను తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్ తెలిపారు.ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయవలసిన మక్కజొన్న బస్తాలు 1,30,000 నిల్వ ఉన్నాయని అన్నారు.
ప్రస్తుతం మార్కెట్ యార్డుకు అధికంగా మక్కజొన్నలు వస్తున్నాయని, స్థలం సరిపోకపోవడం, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం తదితర కారణాల వల్ల మే 2 నుంచి తిరిగి ప్రకటించే వరకు రైతులు నర్సంపేట మార్కెట్ యార్డుకు మక్కజొన్నలు అమ్మకమునకు తీసుకురావొద్దని సూచించారు.తీసుకువచ్చిన రైతులు ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని, కావున రైతులు సహకరించాలని మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్ కోరారు.
