నూతన పోలీస్ స్టేషన్ కు తాత్కాలిక భవనం ఎమ్మెల్యే జిఎస్ఆర్
భూపాలపల్లి నేటిధాత్రి
కొత్తపల్లి గోరి మండలం కేంద్రంలో నూతనగా పోలీస్ స్టేషన్ కు అవసరమైన తాత్కాలిక భవనమును ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పరిశీలించారు.అదేవిధగా ఈ నెల చివరికల్లా నూతన పోలీస్ స్టేషన్ భవనము శంకుస్థాపన కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి లేదా వరంగల్ జిల్లా ఇంచార్జీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వస్తారని ఎమ్మెల్యే జీఎస్సార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి సంపత్ రావు చిట్యాల సీఐ మల్లేష్ రేగొండ ఎస్ఐ సందీప్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.