చిత్ర పరిశ్రమలో తెలంగాణ రాష్ట్ర యువతకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి
◆:- పి.రాములు నేత
జహీరాబాద్ నేటి ధాత్రి:
జాగో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో నిర్మిస్తున్న అనేక చిత్రాలలో తెలంగాణ రాష్ట్ర యువతకు అనేక రకాల కళ్ళల పట్ల విశేష నైపుణ్యం ఉన్నప్పటికీ చిత్ర పరిశ్రమల్లో అవకాశాలు లేక నిరుత్సాహానికి గురవుతున్న యువతకు తెలంగాణ రాష్ట్రంలో తీస్తున్న చిత్రాలలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అదేవిధంగా స్వరాష్ట్ర ఏర్పడ్డాక ఈ రాష్ట్రంలో ఉన్న వనరులను వినియోగించుకోలేకపోతున్న పరిశ్రమలు చిన్న చిన్న సంస్థలలో వ్యవసాయ రంగాలు వీటన్నిటిలో మన యువత ఉపాధి పొందేలా చైతన్యం తీసుకురావడానికి ఒక భారీ చిత్రాన్ని నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర చిత్ర పరిశ్రమ అభివృద్ధి సంస్థ చైర్మన్ దిల్ రాజు గారిని కలిసి కోరిన పి. రాములు నేత మరియు తెలంగాణ రాష్ట్ర మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి మరియు పి. అరవింద్ హైదరాబాదులోని తన నివాసంలో కలిసి మాట్లాడినారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో చిత్రాలను నిర్మించడానికి అవకాశమున్న ప్రాంతాలలో చిత్రాలు నిర్మించి మన రాష్ట్ర అందమైన ప్రదేశాలను టూరిజంను అభివృద్ధి అయ్యేలా చూడాలని అదేవిధంగా జహీరాబాద్ నియోజకవర్గంలోని సహజ సిద్ధమైన ఎత్తిపోతల ప్రాంతాన్ని పక్కనే ఉన్న వికారాబాద్ అనంతగిరిని సింగూరు ప్రాజెక్టు ఇలా చాలా రకాల అందమైన ప్రదేశాలలో సినిమాలు చిత్రీకరిస్తే ఆ ప్రాంతానికి వీక్షకులు పెద్ద వత్తిన తరలివచ్చి ఆ ప్రాంతం అభివృద్ధి చెంది అనేక రకాల వ్యక్తులకు ఉపాధి దొరుకుతుందని అదేవిధంగా రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని కోరినారు దీనికి సానుకూలంగా స్పందించిన తెలంగాణ రాష్ట్ర చిత్ర పరిశ్రమ చైర్మన్ దిల్ రాజు త్వరలో జహీరాబాద్ ప్రాంతంలోని ఎత్తిపోతల గొట్టం గుట్ట ప్రాంతాలలో స్థానిక యువతతో ఒక చక్కటి సినిమాను చిత్రీకరిస్తానని తెలిపినారు దీనికి సంతోషించి దిల్ రాజు గారికి సంతోషంతో కృతజ్ఞతలు తెలపడం జరిగినది,
