గంగారం, నేటిధాత్రి :
మహబూబాబాద్ జిల్లా ములుగు నియోజకవర్గం గంగారం మండల కేంద్రం లోని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జాడి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జూన్ 2 ఉదయం 8 గంటలకు మన ప్రియతమ నాయకురాలు తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ గ్రామీణ అభివృద్ధి శాఖ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ అనసూయ సీతక్క వారి ఆదేశాల మేరకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది ముగింపు వేడుకలు అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించబడతయాని ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ,జిల్లా ,మండల నాయకులు, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు అన్ని గ్రామాల గ్రామ కమిటీ అధ్యక్షులు ఉపాధ్యక్షులు , బూత్ కమిటీ అధ్యక్షులు, యూత్” యువజన సంఘం నాయకులు, కిసాన్ సేల్ విభాగం, విద్యార్థి విభాగం మహిళలు, ఎన్ రోలర్స్, సోషల్ మీడియా విభాగం, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు చాలా ప్రాముఖ్యతతో కూడిన ఈ వేడుకలలో ప్రతి ఒక్కరూ తప్పకుండా పాల్గొని ఈ యొక్క గొప్ప కార్యక్రమంలో భాగస్వామ్యం కాగలరని అని అన్నారు..