జోరుగా బిఆర్ ఎస్ సర్పంచ్ అభ్యర్థి తౌటం లక్ష్మి ప్రచారం.
చిట్యాల, నేటిదాత్రి :
చిట్యాల గ్రామ పంచాయతి ఎన్నికలలో చిట్యాల గ్రామ సర్పంచ్ అభ్యర్థి తౌటం లక్ష్మి ప్రచారం తో దూసుకుపోతున్నారు, చిట్యాల మండల కేంద్రంల్లో ఇంటి ఇంటి ప్రచారం చేసారు. చిట్యాల గ్రామ అభివృద్ధి కి దోహదం చేస్తాం అని గ్రామాన్ని అన్ని రంగాలలో అన్ని రకాలుగా అభివృద్ధి చేసి గ్రామాన్ని ప్రధమ స్థానములో పెడుతాం అని తెలిపారు,గ్రామా ప్రజలు మీ అమూల్యమైన ఓటు బ్యాట్ గుర్తుకు వేసి అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని* కోరారు.
తౌటం లక్ష్మి ప్రచారం తో గ్రామములో ప్రజలుజోష్ నిండిపోతున్నారు గ్రామ అభివృద్ధి చేయాలంటే మిమ్మల్ని
తప్పకుండ గెలిపిస్తాం అని గ్రామ ప్రజలు ఆశభావం వ్యక్తము చేస్తున్నారుఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల గ్రామ నాయకులు మహిళలు గ్రామ ప్రజలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
