ప్రతిభావంతుడు…ప్రగతిశీల నాయకుడు

https://epaper.netidhatri.com/

` అత్యంత ప్రభావంతమైన నాయకుడు.

`యువతకు స్పూర్తి దాయకుడు.

`తెలంగాణ కొట్లాటలో ముందు నిలిచాడు.

`తెచ్చుకున్న తెలంగాణ లో అభివృద్ధి బాటలు వేస్తున్నాడు.

`తనను గెలిపించిన సిరిసిల్లను సిరుల సిల్లగా మార్చాడు.

`సిరిసిల్ల ను ఎంతో సింగారించాడు.

`అభివృద్ధి కి కేరాఫ్‌ గా మలిచాడు.

`పార్టీని పటిష్ఠం చేయడంలో ఆరితేరాడు.

`పార్టీ కార్యకర్తలను కుటుంబ సభ్యులగా చూసుకుంటాడు.

`సమస్యలు లేని సమాజ నిర్మాణం సాగిస్తున్నాడు.

`ఐటిని విస్తరింపజేశాడు.

`హైదరాబాద్‌ నగరానికి విశ్వనగరంగా తీర్చి దిద్దుతున్నాడు.

`ఏ పనిలోనైనా ద్విపాత్రాభినయం అలవోకగా నిర్వర్తిస్తాడు.

`సవ్యసాచి లా రాజకీయాలలో కీర్తి గడిరచాడు.

`రేపటి తరానికి ఆదర్శప్రాయుడు.

`నవతరం నాయకుడు.

హైదరబాద్‌,నేటిధాత్రి: 

దేశంలో నలుగురు నవతరం నాయకులను గుర్తించాల్సి వస్తే అందులో కేటిఆర్‌ కచ్చితంగా వుంటారు. అంతటి సమర్థవంతమైన నాయకుడు కేటిఆర్‌. ఒక దశలో తెలంగాణ ఉద్యమం గురించి దేశ వ్యాప్తంగా తెలియజేయాల్సిన అవసరం ఏర్పడినప్పుడు కేటిఆర్‌ కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమంలోకి అలా కేటిఆర్‌ ప్రవేశించారు. అటు క్షేత్ర స్థాయిలో పోరాటం, ఇటు ఉద్యమ ప్రస్థానం గురించి దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు వివరించడంతో సవ్యసాచి గా మారాడు. ఇప్పుడు కూడా అటు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గా, ఇటు మంత్రిగా ద్విపాత్రలను ప్రజాసేవలో అలవోకగా పోషిస్తున్నారు. అటు ప్రజలకు, ఇటు శ్రేణులకు న్యాయం చేస్తున్నారు. రాజకీయాలలో ఇలా అరుదైన పాత్రను పోషిస్తున్న వారిలో కేటిఆర్‌ ముందు వరుసలో వుంటారు. అంతే కాదు మంత్రిగా విధుల నిర్వహణలోనూ మళ్ళీ రెండు రకాల విధులు నిర్వర్తిస్తున్నారు. ఎక్కడ తగ్గకుండా అన్ని పనులు నిర్వహిస్తున్నాడు. పదేళ్ల క్రితం వరకు హైదరాబాద్‌ పరిస్థితి ఏమిటి? ఇప్పటి అభివృద్ధి ఏమిటి? ఒకప్పుటి మున్సిపల్‌ పాలన ఎలా వుండేది! ఇప్పుడెలా వుంది! ఒకప్పటి నగరం ట్రాఫిక్‌ ఎలా వుండేది. కొత్తగా ముప్పైకి పైగా ఫ్లై ఓవర్ల నిర్మాణంతో ట్రాఫిక్‌ ఎలా తగ్గింది. హైదరాబాద్‌ అందమైన విశ్వ నగరంగా ఎలా తీర్చి దిద్దబడిరది.ఇదంతా ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆలోచన. కేటిఆర్‌ ఆచరణ. ఏక కాలంలో అటు మంత్రి గా రెండు శాఖలు, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గా, ఎమ్మెల్యే గా ప్రజాసేవను నిర్వర్తిస్తున్నారు. తనదైన ముద్ర ను వేస్తున్నారు. వారసుడు అంటే ఇలా వుండాలి. తల్లిదండ్రులకు పేరు తేవాలి. పుట్టిన గడ్డకు కీర్తిని తెచ్చిపెట్టాలనుకునే వాళ్లు ఎంత మంది వుంటారు. ఒకవేళ కేటిఆర్‌ కు రాజకీయాలే కావాలనుకుంటే తెలంగాణ వస్తేనే వచ్చేవారేమో! కానీ కేటిఆర్‌ తెలంగాణ కోసం కొట్లాడేందుకు రాజకీయాలలోకి వచ్చారు. ఉన్నత ఉద్యోగం, అమెరికా జీవితం, విలాసవంతమైన జీవనం అన్నీ వదిలేసుకొని వచ్చారు. వస్తుందో రాదో తెలియని తెలంగాణ కోసం కొట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా నమ్మక ద్రోహులు చేరి, ఉద్యమానికి ద్రోహం చేస్తున్న క్రమంలో కేసిఆర్‌ కు అండగా నిలబడేందుకు వచ్చాడు. తెలంగాణ ద్రోహుల వల్ల తెలంగాణ ఉద్యమం ఆగం కాకుండా కాపాడుతూ వచ్చారు. ఇదీ కేటిఆర్‌ అంకితభావం.

ఒక్క మాటలో మంత్రి కేటిఆర్‌ గురించి చెప్పాల్సి వస్తే ప్రతిభావంతుడు…ప్రగతిశీల నాయకుడు చెప్పడం సబబుగా ఉంటుంది. 

అంతటి ప్రతిభాశాలి కేటిఆర్‌. అత్యంత ప్రభావంతమైన నాయకుడు. ఈ మాట కొందరికి నచ్చకపోవచ్చు. కానీ అందరికీ తెలుసు. గతంలో పని చేసిన ఏ ముఖ్యమంత్రి వారసుడు కూడా ఇంతటి ప్రతిభను చూపిన దాఖలాలు లేవు. అంతటి పేరు ప్రఖ్యాతులు గాంచింది లేదు. పైకి ప్రతిపక్షాల నాయకులు ఎంత మాట్లాడినా, లోపల మాత్రం కేటిఆర్‌ ను పొగడక మానరు. అదేంటో గాని కేటిఆర్‌ తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఎమ్మెల్యేగా వున్నారు. కానీ అప్పటి పరిస్థితులకు అనుగుణంగానే వ్యవహరించారు. ఎక్కడా పరిధి దాటలేదు. తన పరిమితులు దాటలేదు. అప్పటి సీనియర్లను కాదని ముందుకు వెళ్లలేదు. ఒకానొక దశలో నిత్య విద్యార్థిగా తెలంగాణ పరిస్థితులు, భౌగోళిక విషయాలు, తెలంగాణ సాధన, గోసలను అధ్యయనం చేశాడు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఎలాగైతే ప్రతి విషయం మీద పట్టు సాదిస్తుంటారో అచ్చం అదే విధంగా కేటిఆర్‌ కూడా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకుంటారు. ప్రతి అంశాన్ని అవగాహన చేసుకున్న తర్వాతే మాట్లాడుతుంటారు. ఇక ఇటీవల కాలంలో మాత్రం కేటిఆర్‌ అంటే ప్రతిపక్షాలకు హడలెత్తిపోతోంది. సహజంగా గతంలో ఎప్పుడైనా ప్రతిపక్షాలు ఏం మాట్లాడతాయో! అని ప్రజలు ఆసక్తి చూపించేవారు. ప్రభుత్వాలను ఎలా ఇరుకున పెడతారో గమనించే వారు. ఆ పరిస్థితిని మంత్రి కేటిఆర్‌ పూర్తిగా మార్చేశారు. ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలతోనే మంత్రి కేటిఆర్‌ ఎదురుదాడి ఎలా చేస్తాడో చూద్దాం అనుకునే స్థాయికి తన వాక్చాతుర్యాన్ని తీసుకెళ్లాడు. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. తెలంగాణ ఉద్యమం మొదలైన తర్వాత ఉద్యమ నాయకుడైన కేసిఆర్‌ ఏం మాట్లాడున్నాడనే దానిపై అన్ని రాజకీయ పక్షాలు ఎంతో ఆసక్తిని ప్రదర్శించేవి. ముఖ్యంగా తెలంగాణకు జరిగిన అన్యాయంపై కేసిఆర్‌ ఎన్ని గంటలు మాట్లాడినా కదలకుండా, కన్నార్పకుండా చూస్తూ, వినేవారు. తెలంగాణ లో ప్రజలు కేసిఆర్‌ మాటలను క్యాసెట్లు, సిడిల రూపంలో కొనుగోలు చేసి మరీ వినేవారు. ఇప్పటికీ ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఎన్ని గంటలు మాట్లాడినా ఎంతో ఓపికతో వింటుంటారు. అలాగే కేటిఆర్‌ మాట్లాడుతుంటే కూడా వింటున్నారు. ప్రజలను అంతగా తమ మాటల ద్వారా ఆకర్షించుకుంటున్న నేతలు ఇద్దరూ కావడం విశేషం. 

యువతకు స్పూర్తి దాయకుడు.

 యువకుడైన ప్రతి వ్యక్తి తన దారిని ఎంచుకునే క్రమంలో కూడా కేటిఆర్‌ ఆదర్శమే. ముఖ్యంగా తెలంగాణ యువతకు కేటిఆర్‌ మార్గదర్శకుడనే చెప్పాలి. మంత్రి కేటిఆర్‌ మిగతా నాయకులకన్నా ప్రత్యేక శైలిని ప్రదర్శిస్తుంటారు. ఆక్టివ్‌ పాలిటిక్స్‌ నెరపడంలో ఎప్పుడూ ముందుంటారు. ఇప్పుడున్న క్యాబినెట్‌ లో అందరికన్నా వాక్‌ చాతుర్యం వున్న నాయకుడుగా గుర్తింపు పొందారు. అందరికీ అలా మాట్లాడడం రాదు. ఒక రకంగా చెప్పాలంటే అది పూర్వ జన్మ సుకృతం అనే చెప్పాలి. కొన్ని సార్లు ఎంత గొప్పగా చెప్పినా ప్రజలకు చేరకపోచ్చు. ఎంత సంకిష్టమైన దానినైనా కేటిఆర్‌ లాగా చెబితే ఎంతో సరళంగానే వుంటుంది. విన్న వెంటనే అర్థమౌతుంది. అందులోనూ ఎక్కడికి వెళ్తే అక్కడ ఒదిగిపోవడం కూడా ఒక కళ. తన నియోజకవర్గం సిరిసిల్ల కు వెళ్తే వెంటనే ఆ యాసలో మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అదే పారిశ్రామిక వేత్తలతో మాట్లాడినప్పుడు వెంటనే ఒక హుందాతనం కనిపిస్తుంది. విదేశీ గడ్డపై పెట్టుబడులు విషయంలో మాట్లాడినప్పుడు గొప్ప వక్తగా మారిపోతారు. ఇలా ఇన్ని రకాలుగా తనను తాను నిరూపించుకున్న నాయకులు తెలంగాణలో ఒక్క కేటిఆర్‌ తప్ప మరొకరు లేరు.

తెలంగాణ కొట్లాటలో ముందు నిలిచాడు. తెచ్చుకున్న తెలంగాణ లో అభివృద్ధి బాటలు వేస్తున్నాడు.

తనను గెలిపించిన సిరిసిల్లను సిరుల సిల్లగా మార్చాడు. సిరిసిల్ల ను ఎంతో సింగారించాడు. అభివృద్ధి కి కేరాఫ్‌ గా మలిచాడు. సరిగ్గా దశాబ్దం క్రితం సిరిసిల్ల అంటే ఉరిసిల్ల అంటుండే వారు. సిరిసిల్లలో చేనేత సమాజం ఎక్కువ. నేతన్న జీవన ప్రమాణాలు నానాటికీ దిగజారిపోయే జీవితాలు గడుపుతూవుండే వారు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. సిరిసిల్ల సిరుల సిల్లగా మారింది. సిల్క్‌ సిటీలా తలతలలాడుతోంది. సిరిసిల్ల రూపురేఖలు మారిపోయాయి. టెక్స్‌ టైల్స్‌ పార్క్‌ వచ్చింది. నేతన్నలకు నిత్యం పని కల్పించబడుతోంది. బతుకమ్మ చీరలన్నీ సిరిసిల్ల లోనే నేయబడుతున్నాయి. అంతే కాకుండా ప్రతి సోమవారం కాటన్‌ డే అమలు చేస్తూ నేత బట్టలు కట్టుకునేలా ప్రోత్సహించిన నాయకుడు కేటిఆర్‌. ఇప్పటికీ ప్రతి సోమవారం కేటిఆర్‌ నేత దుస్తులు ధరించడం గమనార్హం. 

పార్టీని పటిష్ఠం చేయడంలో ఆరితేరాడు. పార్టీ కార్యకర్తలను కుటుంబ సభ్యులగా చూసుకుంటాడు.

 సమస్యలు లేని సమాజ నిర్మాణం సాగిస్తున్నాడు. ఐటిని విస్తరింపజేశాడు. తెలంగాణ పారిశ్రామిక రంగం విప్లవాన్ని చూస్తోంది. అందులో కేటిఆర్‌ కృషి గొప్పది. తెలంగాణ రాక ముందు ఐటి. ఎగుమతులు కేవలం రూ.50 వేల కోట్లు. ఇప్పుడు రెండున్నర లక్షల కోట్లకు చేరుకున్నది. అందుకోసం కేటిఆర్‌ నిరంతరం శ్రమించారు. దేశ విదేశాలలోని వివిధ కంపెనీలతో మాట్లాడి, ఒప్పించి, సౌకర్యాల కల్పనలో సింగిల్‌ విండో విధానాన్ని తెచ్చారు. ఐటి అభివృద్ధికి బాటలు వేశారు. ఐటి అంటే హైదరాబాద్‌ కేరాఫ్‌ గా మార్చారు. దిగ్గజ ఐటి కంపనీలన్నీ హైదరాబాద్‌ లో తమ సంస్థలు ఏర్పాటు చేసుకునేలా చేశారు. అంతేకాదు ఐటి పరిశ్రమ హైదరాబాద్‌ కే పరిమితం కాకుండా తెలంగాణ వ్యాప్తంగా విస్తరించాడు. వరంగల్‌, కరీంనగర్‌, ఆఖరుకు సిద్దిపేటలో ఐటి టవర్లు ఏర్పాటు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఐటి వ్యాపారం విస్తరించేందుకు మార్గం సుగమం చేశారు. ఇంకా కొంత కాలం ఆగితే దిగ్గజ కంపెనీలు తెలంగాణ లోని ఇతర ప్రాంతాలకు విస్తరించేందుకు కేటిఆర్‌ కృషి చేయగలరు. ఇదిలా వుంటే తెలంగాణ లో ఫార్మా హబ్‌ రూపుదిద్దుకున్నది. అనేక ఫార్మా కంపనీలు హైదరాబాదు ఫార్మా హబ్‌ లో పెట్టుబడులు పెడుతున్నాయి. ఇప్పటికే అనేక కంపెనీలు తమ ఉత్పత్తులు కూడా మొదలుపెట్టాయి. హైదరాబాద్‌ నగరానికి విశ్వనగరంగా తీర్చి దిద్దుతున్నాడు. ఏ పనిలోనైనా ద్విపాత్రాభినయం అలవోకగా నిర్వర్తిస్తాడు. సవ్యసాచి లా రాజకీయాలలో కీర్తి గడిరచాడు. రేపటి తరానికి ఆదర్శప్రాయుడు.

నవతరం నాయకుడు కేటిఆర్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!