*మున్సిపల్ కమిషనర్‌పై చర్యలు తీసుకోండి – ఆర్.డి. శ్రీధర్…

*మున్సిపల్ కమిషనర్‌పై చర్యలు తీసుకోండి – ఆర్.డి. శ్రీధర్…

*నోటీసులు ఇవ్వకుండా ఇళ్లను కూల్చేశారు…

తిరుపతి(నేటిధాత్రి:

శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలని శ్రీకాళహస్తి సన్నిధి వీధికి చెందిన ఆర్.డి. శ్రీధర్ డిమాండ్ చేశారు. మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో కుటుంబం సభ్యులతో కలిసి మాట్లాడారు. సన్నిధి వీధిలో రెండు ఇండ్లను అనధికారికంగా కూల్చివేసి, ప్రశ్నించినందుకు మున్సిపల్ అధికారులు మూడో ఇంటికి నోటీసులు ఇచ్చారని వారు తెలిపారు.ఇంకా, తమను బెదిరిస్తూ ఇంటి ముందు గుమికూడి దుర్భాషలాడటం, గేటుకు తాళం వేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. సిడిఎంఏకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపోయిందని, ఎమ్మెల్యేను కలిసినా న్యాయం జరగలేదని వాపోయారు.జేసీబీలతో ఇళ్లను కూల్చే ప్రయత్నం చేస్తే అగ్ని ప్రమాదం జరిగే ప్రమాదం ఉందని, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు…

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version