వైఎస్ఆర్ చిత్రపటానికి నివాళి అర్పించిన ఎమ్మెల్యే

వైఎస్ఆర్ చిత్రపటానికి నివాళి అర్పించిన ఎమ్మెల్యే నాయిని..

#కాంగ్రెస్ భవన్ లో నేతలతో కలసి వైఎస్ఆర్ జయంతిలో పాల్గొన్న ఎమ్మెల్యే..

హన్మకొండ, నేటిధాత్రి:

ఉమ్మడి రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఈ రోజు ఉదయం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి హనుమకొండ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాజశేఖర్ రెడ్డి ఎన్నో సంస్కరణలు పేద ప్రజల కోసం ఆరోగ్యశ్రీ,ఫీజు రీయింబర్స్ మెంట్,రుణమాఫీ,రైతులకు ఉచిత విద్యుత్తు వంటి పథకాలను అమలు చేశారని గుర్తు చేసుకున్నారు.నేతి తరం నాయకులకు వైయస్ రాజశేఖర రెడ్డి పాలన రోల్ మోడల్ అని అన్నారు.ఉమ్మడి రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ మరణాన్ని జీర్ణ్చుకోలేని వ్యక్తి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version