పవర్ లిఫ్టింగ్‌లో మెరిసిన సారుగు అఖిల
తెలంగాణ రాష్ట్ర ఛాంపియన్‌షిప్‌లో సిల్వర్ మెడల్ కైవసం
అభినందించిన ఏసీపీ పున్నం రవీందర్ రెడ్డి
నర్సంపేట,నేటిధాత్రి:
తెలంగాణ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్–2026 పోటీల్లో నర్సంపేటకు చెందిన సారుగు అఖిల ప్రతిభ కనబరిచి సిల్వర్ మెడల్ సాధించింది. 76 కిలోల విభాగంలో పోటీ పడిన ఆమె రెండో స్థానంలో నిలిచి ప్రశంసలు అందుకుంది.ఈనెల 18, 19 తేదీల్లో హైదరాబాద్‌లోని సనత్‌నగర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో రాష్ట్ర స్థాయి సబ్‌జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో బాలికలు, బాలురకు ఈ పోటీలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. అఖిల 3డి యూనిసెక్స్ జిమ్‌లో కోచ్ దేవేందర్ నాయక్ వద్ద శిక్షణ పొందుతోంది.ఈ సందర్భంగా నర్సంపేట ఏసీపీ పున్నం రవీందర్ రెడ్డి మంగళవారం అఖిలను అభినందించారు. వరంగల్ జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ కార్యదర్శి సంఘాల కమల్, అమేచ్యూర్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ మాజీ జిల్లా జాయింట్ సెక్రటరీ కుంటమల్ల అరవింద్, గనిపాక రవితేజ తదితరులు అఖిల విజయాన్ని అభినందించారు.
