గురుకుల కళాశాల సంక్రాంతి వేడుకలు
మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :
గురుకుల మహిళా కళాశాలలో సంక్రాంతి వేడుకలు అట్టహాసంగా జరిగాయి. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల జగద్గిరిగుట్ట శామీర్ పేట్ లోని క్యాంపుస్ లో శుక్రవారం ముందస్తు సంక్రాంతి వేడుకలను నిర్వహించారు. విద్యార్థులు సంక్రాంతికి సంబంధించిన పాటలు పాడుతూ ముగ్గులు వేసి, బోగి మంటలు వేశారు. గొబ్బెమ్మలతో సంస్కృతిని చాటారు . ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ Dr ఇశ్రత్, వైస్ ప్రిన్సిపాల్ Dr V స్రవంతి, అకాడమిక్ వైస్ ప్రిన్సిపాల్ M గీత, కల్చరల్ కోఆర్డినేటర్స్ జి ధనవేణి, అంతుల్, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.
