నేటిధాత్రి కథనానికి స్పందించిన అధికారులు..

నేటిధాత్రి కథనానికి స్పందించిన అధికారులు

డిసెంబర్ 31 నుంచి ఎస్సారెస్పీ నీటి విడుదల

ప్రణాళిక సిద్ధం చేశాం

ఎస్సారెస్పీ ఏఈ వాసంతి

శాయంపేట నేటిధాత్రి:

 

 

నీటి పారుదలశాఖ ఆధ్వర్యం లో ఎస్సీఐడబ్ల్యూఎమ్ కమిటీ నిర్ణయించిన ప్రకారం డిసెంబర్ 31 నుంచి ఎస్సారెస్పీ ఆయ కట్టుకు కాలువల ద్వారా ఈ సంవత్సరం యాసంగి పంట లకు సాగునీటి విడుదల ప్రారం భమవుతుంది.శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి ఈ నెల 31 యాసంగి పంటలకు సాగునీరు విడుదల చేయనున్నట్లు ఏఈ వాసంతి తెలిపారు వారబంది పద్ధతిలో నీటి సరఫరా కొనసా గుతుందని రైతులు నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని విజ్ఞప్తి చేశారు ఆయకట్టు రైతులకు మేలు చేకూర్చేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు

వార బంధీ పద్ధతిలో నీటి విడుదల

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి యాసంగి సీజన్ ఈనెల 31 నుంచి నీటిని విడుదల చేయా లని అధికారులు నిర్ణయిం చారు కాకతీయ కాలువలో ద్వారా జోన్ – 1 7 రోజుల పాటు, జోన్ 2 ఎనిమిది రోజులపాటు సాగునీటి విడుదలకొనసాగించబ డుతుందని అధికారులు తెలియజేశారు. సాగునీటిని వృధా కాకుండా పొదుపుగా వాడుకొని సహకరించాలని రైతులందరికీ విజ్ఞప్తి చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version