అభివృద్ధి కి కట్టుబడి ఉన్నాం…

అభివృద్ధి కి కట్టుబడి ఉన్నాం

* అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రభుత్వం చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎంపీ ఈటెల, ఎంఎల్ఏ మల్లారెడ్డి

* కాంగ్రెస్ హయాంలో సంక్షేమానికి పెద్దపీట

* మూడు చింతలపల్లిలో నూతన ఎమ్మార్వో కార్యాలయ ప్రారంభం

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

 

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని ప్రభుత్వం చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. మేడ్చల్ నియోజకవర్గం మూడు చింతలపల్లి, అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని మూడు చింతలపల్లి లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎమ్మార్వో కార్యాలయం, పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎంపీ ఈటెల రాజేందర్, మాజీ మంత్రి, మేడ్చల్ ఎంఎల్ఏ మల్లారెడ్డి లతో కలసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రజలకు సంక్షేమ ఫలాలను అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందాన్నారు. నూతన ఎమ్మార్వో కార్యాలయం ప్రారంభంతో ప్రజలకు భూ సంబంధిత సేవలు మరింత సులభంగా, వేగంగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ప్రజలకు మెరుగైన పాలనా సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయందర్ రెడ్డి, ఆర్డివో తహసీల్దార్ మహ్మద్ గులాం ఇద్రిష్, డిటీ సునీల్, ఆర్ఐ అన్వేష్, సీనియర్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, టిపిసిసి అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్, డీసీఎంఎస్ మాజీ వైస్ చైర్మన్ రామిడి మధుకర్ రెడ్డి, జెడ్పి మాజీ చైర్మన్ శరత్ చంద్రా రెడ్డి, టిపిసిసి ప్రధాన కార్యదర్శి పీసరి మహిపాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నర్సింహులు యాదవ్, ఆర్టీఏ మెంబెర్ భీమిడి జైపాల్ రెడ్డి, గ్రంధాలయం చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, ఎ బ్లాక్ అధ్యక్షులు వేణు గోపాల్ రెడ్డి, మూడు చింతలపల్లి మున్సిపాలిటీ అధ్యక్షులు దోసకాయల వెంకటేష్, గోన మహేందర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.

బీఆర్ఎస్ పార్టీ నుండి కొమ్మురాజు సస్పెండ్…

బీఆర్ఎస్ పార్టీ నుండి కొమ్మురాజు సస్పెండ్.

#పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కార్యకర్తలు.

#సస్పెండ్ చేస్తున్నట్లు ధ్రువీకరించిన గ్రామ పార్టీ అధ్యక్షుడు గండు శ్రీధర్.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

గత స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ అభ్యర్థి ఓటమికి కారణమైన కొమ్మురాజను బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు నందిగామ గ్రామ పార్టీ అధ్యక్షుడు గండు శ్రీధర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ గ్రామ పార్టీ కార్యకర్తలతో కలిసి సమావేశం ఏర్పాటు చేసి పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ప్రత్యర్థుల విజయం కోసం సొంత పార్టీ అభ్యర్థుల ఓటమికి కారణానికి ప్రధాన భూమిక పాత్ర పోషించిన కొమ్మురాజును పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ గ్రామ పార్టీ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగిందని . అధిష్టానం నిర్ణయం మేరకే గ్రామ పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మేడిపల్లి శంకరయ్య, వార్డు సభ్యులు ఇంగోలి ఉమా విజేందర్, తేజ వత్ రాజు, భూక్య సుజాత మధుకర్, మూడు కల్పన దినేష్, మాజీ ఉపసర్పంచ్ కిస్టోజు బ్రహ్మచారి, నాయకులు మేడిపల్లి వెంకటరాజ్యం, సదయ్య, చెట్టుపల్లి దామోదర్, జంగిలి శంకరయ్య, హింగే లింగమూర్తి, గాజుల పాటి బిక్షపతి, కొల్లూరి శంకరయ్య, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version