* నర్సంపేట బిఆర్ఎస్ అభ్యర్థుల జాబితా విడుదల*
బిఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి సహకరించాలి
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
నర్సంపేట,నేటిధాత్రి:
రాష్ట్రంలో రాబోయేది టిఆర్ఎస్ ప్రభుత్వమే అని, రాబోయే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికలలో పోటీ చేస్తున్న బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థుల గెలుపు కోసం నర్సంపేట పట్టణ ప్రజలు కార్యకర్తలు నాయకులు సహకరించాలని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కోరారు. నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికలలో 30 వార్డులలో బరిలోకి దింపిన ఆ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థుల జాబితాను పెద్ది సుదర్శన్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా పెద్ది మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ నాయకత్వం సుదీర్ఘంగా ఆలోచించి అన్ని సామాజిక వర్గాలతో కూడిన బలమైన కౌన్సిలర్ అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగిందన్నారు.ఈ ఎన్నికలలో తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ అభ్యర్థుల ఎంపికకు సహకరించిన పార్టీ నాయకులకు ,పార్టీ శ్రేణులకు ,కార్యకర్తలకు నా కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల పట్ల ఆశావాహులకు భవిష్యత్తులో పార్టీ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
30 వార్డులల్లో బిఆర్ఎస్ అభ్యర్థుల వివరాలు..
1 వ వార్డు కడారీ కవిత – కుమారస్వామి,2 వ వార్డు గోలి అనిత – శ్రీనివాస్ రెడ్డి,3 వ వార్డు మండల కుమారస్వామి,4వ వార్డు బీరం నాగిరెడ్డి,5 వ వార్డు బొడుగు సంధ్యారాణి – శ్రీనివాస్,6వ వార్డు వేణుముద్దల శ్రీధర్ రెడ్డి,7 వ వార్డు మోతే తిరుపతిరెడ్డి,8 వ వార్డు పెండెం కళ్యాణి – వెంకటేశ్వర్లు,9 వ వార్డు రాయుడి కీర్తి దుష్యంత్ రెడ్డి,
10 వ వార్డు నాగిశెట్టి పద్మ ప్రసాద్,11 వ వార్డు పెండ్యాల జ్యోతి – ప్రభాకర్,12 వ వార్డు ఇస్లావత్ రజిత రాజన్న నాయక్,13 వ వార్డు అంగోత్ సుధాకర్ లాల్,14 వ వార్డు బుస శిరీష – రాజు,15వ వార్డు మీరాల ఐలయ్య యాదవ్,16 వ వార్డు బానోతు నవీన్ నాయక్,17 వ వార్డు నల్లా మనోహర్ రెడ్డి,18 వ వార్డు దొమ్మటి రమ్య – సంతోష్ గౌడ్,19 వ వార్డు గాలి శ్రీనివాస్ యాదవ్,20 వ వార్డు వాసం కరుణ – సాంబయ్య,21 వ వార్డు శివరాత్రి స్వామి,
22 వ వార్డు మాదాసి ప్రవీణ్,23 వ వార్డు మంద రిషిత – ప్రసాద్,24 వ వార్డు పెండెం శివానంద్,
25 వ వార్డు నాడెం సునీత – శాంతి కుమార్,
26 వ వార్డు మండల శ్రీదేవి – శ్రీనివాస్,27 వ వార్డు గిరగాని హైమావతి – సాంబయ్య గౌడ్,28 వ వార్డు చింతల రేఖా టార్జాన్,29 నాగెల్లి పద్మ వెంకటనారాయణ గౌడ్,30 వ వార్డు బండి ప్రవీణ్ కుమార్.
