వార్డు అభివృద్ధికి కృషి చేస్తా

వార్డు అభివృద్ధికి కృషి చేస్తా

వార్డు ప్రచారంలోఏకు దివ్య విద్య సాగర్

పరకాల,నేటిధాత్రి

మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ఏకు దివ్య -విద్య సాగర్ వార్డులో ఇంటింటా తిరుగుతూ తమను గెలిపించాలని కోరారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించాలనే సంకల్పంతో,వార్డు అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా,నిజాయితీతో ప్రజాసేవ చేయాలనే ఆశయంతో తాను ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు తెలిపారు. ప్రజలతో నేరుగా వారి సమస్యలను తెలుసుకుని పరిష్కార దిశగా పనిచేస్తానని చెప్పారు. 20వ వార్డులో మౌలిక వసతుల వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు. ప్రజల ఆశీర్వాదంతో విజయం సాధించి,4వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version