సత్యలోకం చూపించబోతున్నాం

 

సత్యలోకం చూపించబోతున్నాం

చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర కథ గురించి దర్శకుడు..

చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘విశ్వంభర’ కథ గురించి దర్శకుడు వశిష్ఠ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘మన పురాణాల ప్రకారం మొత్తం 14 లోకాలుంటాయి. యమలోకం, పాతాళం, స్వర్గం.. ఇలా ఇప్పటివరకూ పలు చిత్రాల్లో ఈ లోకాలను ఎవరికి వారు తమకు తోచినట్లు చూపించారు. ‘విశ్వంభర’లో మేం వీటిని దాటి ఇంకా పైకి వెళ్లాం. ఈ 14 లోకాలకు మూలమైన సత్యలోకాన్ని ఇందులో చూపించబోతున్నాం. కథానాయకుడు ఆ లోకానికి ఎలా వెళ్తాడు, కథానాయికను భూమిపైకి ఎలా తీసుకొస్తాడు అనే పాయింట్‌ చుట్టూ అల్లుకున్న కథ ఇది’ అని చెప్పారు. ఈ సినిమా కోసం భారీ ఖర్చుతో అద్భుతమైన సెట్స్‌ వేసి అందులో చిత్రీకరణ జరుపుతున్నారు. చిరంజీవికి జోడీగా త్రిష, ఆషికా రంగనాథ్‌ నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version