సంకల్పం ఉంటే ఏదైనా సాధించొచ్చు
భారీ మట్టి గణపతులను తయారు చేస్తూ తన ప్రతిభను చాటుకుంటున్న ఊట్కురి శంకర్
పర్యావరణాన్ని కాపాడుదాం… మట్టి గణపతులను పూజిద్దాం
కేసముద్రం/ నేటి ధాత్రి
కేసముద్రం మున్సిపాలిటీ లోని కేసముద్రం విలేజ్ గ్రామానికి చెందిన ఊట్కూరి శంకర్ తన చిన్న వయసు నుండే మట్టి గణపతులను తయారు చేస్తూ అందరి మన్ననలు పొందాడు అప్పటినుండి మొదలైన తన మట్టి గణనాధుల ప్రతిమల తయారీ ప్రయాణం కొనసాగిస్తూ తనలోని నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటూ పర్యావరణ ప్రేమికులకు ఆదర్శంగా నిలుస్తూ కే సముద్రం ప్రజల మనసు గెలుచుకుంటూ అబ్బుర పరుస్తున్నారు ఊట్కూరి శంకర్, కేసముద్రం విలేజ్ బస్టాండ్ సెంటర్లో శ్రీ మట్టి గణపతి ఉత్సవ కమిటీలో ఊట్కూరి శంకర్ ఎం ఎస్ సి చదువుకొని మహబూబాబాద్ నలంద డిగ్రీ ప్రైవేట్ కళాశాలలో బోటనీ లెక్చరర్ గా విధులు నిర్వహించుకుంటూ ఉత్సవ కమిటీలో ఒక సభ్యునిగా కొనసాగుతూ గత కొన్ని సంవత్సరాలుగా తాను సొంతంగా తయారు చేసిన మట్టి గణపతిని ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసుకున్న మండపంలో పూజలు నిర్వహిస్తామని వివరించారు. సాక్షాత్తు శ్రీ పార్వతీదేవి తన స్వా హస్తాలతో మట్టి గణపతిని చేసి ప్రాణప్రతిష్ట చేసిందని పురాణాలు చెబుతున్నాయి, మనుషులను సృష్టించిన దేవతల ప్రతిమల్ని మనం కూడా మట్టితోనే వినాయకుడి రూపు ప్రతిమ విగ్రహాన్ని తయారు చేసుకుని పూజించడం మన సనాతన ధర్మ ఆచారం అని వినాయకుని భక్తితో పూజించే ప్రజలు అందరూ ఈ ధర్మాన్ని పాటిస్తూ పర్యావరణాన్ని కాపాడుకోవాలని వివరించారు. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయకుని పూజిద్దాం… పర్యావరణహిత ప్రేమికులమవుతాం అనే ఈ సందేశం నన్ను కదిలించిందని అప్పటినుంచి నేను మట్టి వినాయక విగ్రహాల ప్రతిమలను తయారు చేస్తూ మన వంతు కృషిగా పర్యావరణాన్ని కాపాడుకోవాలని పర్యావరణ నిపుణులు రెండవ సందర్భాలలో పలు సూచనలు చేస్తూ వస్తున్నారని అన్నారు. ఇప్పటికే గణపతిని ఆరాధించే ప్రజలు 25% శాతం వరకు మట్టి గణపతిని పూజిస్తున్నారని ఇలాగే ప్రతి వినాయకుని మండపాల నిర్వాహకులు మట్టి గణపతి లనే మండపాలలో నెలకొల్పి పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలని పి ఓ పి తో తయారు చేసిన గణపతి విగ్రహాల ప్రతిమలనే పూజించరాదని పిఓపి విగ్రహాల వల్ల కలిగే నష్టం నీటిని కాలుష్యం చేస్తుందని నీటి జీవరాశులకు ముప్పు వాటిల్లుతుందని అందుకే మన వంతు కృషిగా పర్యావరణాన్ని కాపాడుకునేందుకు మట్టి వినాయకు లే ఉత్తమమైనదని తెలిపారు. వినాయకుడు అంటేనే “ప్రకృతి” ప్రకృతిని ఆరాధించే సంస్కృతి మన తెలంగాణ ప్రజల ఆనవాయితీ అని మట్టి విగ్రహాలను సహజ రంగులను వాడటం వల్ల పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని ఊట్కూరి శంకర్ ప్రజలకు విన్నవించుకుంటున్నారు. రానున్న రోజులలో పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయక విగ్రహాల తయారు చేసుకునేందుకు ఉత్సాహవంతులు ముందుకు రావాలని మీలో ఉన్న ప్రతిభను చాటుకోవాలని కోరారు. నేను కూడా ఇంకా కష్టపడి మట్టి గణపతి విగ్రహాల తయారీలో ఉత్సవ కమిటీ సభ్యులు నాకు ఎంతగానో సహకరిస్తున్నారని తన తోటి ఉత్సవ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.సామర్థ్యాన్ని సాధ్యమైనంతవరకు మెరుగుపరుచుకుంటూ ఉత్సాహం ఉన్న వారికి మట్టి గణపతి విగ్రహాల తయారీలో భాగస్వాములను చేస్తానని వారిలో ఉన్న నైపుణ్యాన్ని పెంపొందించేలా సహకారం అందిస్తానని అన్నారు.