2025: తన్వి వెన్నెలకు కాంస్యాలే
తెలుగు షట్లర్ వెన్నెల కలగొట్ల, తన్వీ శర్మ ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షి్‌పను కాంస్య పతకాలతో ముగించారు. శనివారం జరిగిన సెమీఫైనల్లో…
ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్
సోలో (ఇండోనేసియా): తెలుగు షట్లర్ వెన్నెల కలగొట్ల, తన్వీ శర్మ ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షి్‌పను కాంస్య పతకాలతో ముగించారు. శనివారం జరిగిన సెమీఫైనల్లో వెన్నెల 15-21, 18-21తో లూ సియా (చైనా) చేతిలో పోరాడి ఓడింది. మరో సెమీ్‌సలో రెండో సీడ్ తన్వీ శర్మ 13-21, 14-21తో ఎనిమిదో సీడ్ యిన్ యీ కింగ్ (చైనా) చేతిలో పరాజయం చవిచూసింది. కాగా, ఒకే టోర్నీలో ఇలా మహిళల సింగిల్స్‌లో రెండు పతకాలు లభించడం భారత్‌కు ఇదే తొలిసారి కావడం విశేషం.