నాగర్ కర్నూల్ జిల్లా నేటి దాత్రి
వాసవి క్లబ్ నాగర్ కర్నూల్ ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణదినోత్సవం
నాగర్ కర్నూల్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆర్యవైశ్య కుల దైవమైన శ్రీ వాసవి కన్యకాంబ త్యాగం ధర్మం సత్యం కోసం తన ప్రాణాలను అర్పించిన ఆ మహనీయ తల్లి ఆర్యవైశ్య హృదయాలలో నిత్యం వెలుగుతూ మన సమాజాన్ని ఆశీర్వదిస్తూ నిలిచిన దైవ మూర్తి ఈరోజు కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారికి పాలాభిషేకం కుంకుమార్చన మంగళహారతులు పెద్ద ఎత్తున జరిగాయి అనంతరం భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ప్రెసిడెంట్ సంబు శీను సెక్రెటరీ ట్రెజరర్ ఆర్యవైశ్య సోదరీ సోదరీమణులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది
