ఒడ్డే ఓబన్న జీవితం స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలి…

ఒడ్డే ఓబన్న జీవితం స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలి

పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

రామచంద్రపురంలో ఘనంగా ఓబన్న విగ్రహం ఆవిష్కరణ

పఠాన్ చేరు, నేటి ధాత్రి :

భావి తరాలకు ఒడ్డే ఓబన్న జీవితం స్ఫూర్తిదాయకమని పటాన్చెరువు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం నాడురామచంద్రపురం డివిజన్ పరిధిలోని శ్రీనివాస నగర్ కాలనీలో వడ్డెర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఒడ్డే ఓబన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సిపాయిల తిరుగుబాటుకు ముందు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తో కలిసి బ్రిటీష్ సేనలపైన విరోచిత పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి ఓబన్న అని కొనియాడారు. అతని త్యాగాలను భావితరాలకు అందించే లక్ష్యంతో విగ్రహాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు
ఈ కార్యక్రమంలో వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ జైపాల్, వడ్ర సంఘం అధ్యక్షులు లింగయ్య, రామచంద్రాపురం కార్పోరేటర్ పుష్ప నగేష్, మాజీ కార్పొరేటర్ అంజయ్య, సీనియర్ నాయకులు పరమేష్ యాదవ్, ఐలేష్ యాదవ్, పెద్ద రాజు, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version