లీగల్ ఎయిడ్ క్లినిక్ ను ప్రారంభించిన వరంగల్ జిల్లా

లీగల్ ఎయిడ్ క్లినిక్ ను ప్రారంభించిన వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి. నిర్మలా గీతాంబ:-

వరంగల్/హన్మకొండ, నేటిధాత్రి :-

తేదీ:- 26-07-2025 వరంగల్ ఎం.జీ.ఎం. హాస్పిటల్ లోని డి – అడిక్షన్ సెంటర్ ఓ.పి. విభాగంలో లీగల్ ఎయిడ్ క్లినిక్ ను వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి. నిర్మలా గీతాంబ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ “సమాజంలోని పేదలు మరియు వెనుకబడిన వర్గాలకు సులభంగా అందుబాటులో ఉండే చట్టపరమైన సహాయాన్ని అందించడానికి లీగల్ ఎయిడ్ క్లినిక్‌లు ఉద్దేశించబడ్డాయి అని తెలిపారు. ఈ సెంటర్ లో లీగల్ ఎయిడ్ క్లినిక్‌ను నిర్వహించే పారా లీగల్ వాలంటీర్ వై.సిందూజ ప్రజలకు న్యాయ సేవలను అందించడంతో పాటు, మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలకు అలవాటు పడిన వారితో, వారి స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో మాట్లాడటం, కౌన్సెలింగ్ తదితర ప్రత్యామ్నాయ కార్యకలాపాలను చేపట్టడం జరుగుతుంది, తద్వారా మత్తు పదార్థాల బారిన పడిన ప్రజలు కొంతమేరకైనా మారతారేమోనని ఆశిస్తున్నాం.

న్యాయ సలహా మరియు ప్రత్యుత్తరాలు, దరఖాస్తులు, పిటిషన్‌లను రూపొందించడంలో సహాయం చేయడం లీగల్ ఎయిడ్ క్లినిక్‌ యొక్క బాధ్యత అని తెలిపారు. ఈ లీగల్ ఎయిడ్ క్లినిక్ కేవలం ప్రతి శనివారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని, ఎటువంటి సమస్యలనైనా ఈ క్లినిక్ లో తెలియపరిచి, న్యాయ సేవాధికార సంస్థలను ఆశ్రయించాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.సాయి కుమార్, ఎం.జీ.ఎం. సూపరింటెండెంట్ కిషోర్, సైకియాట్రి హెచ్.ఓ.డి. శ్రీనివాస్, ఆర్.ఎం.ఓ అశ్విన్, సైకియాట్రి ఫ్యాకల్టీ మురళీకృష్ణ, చిన్నికృష్ణ, పారాలి ఈగల్ వాలంటీర్ వై.సింధుజ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version