వినూత్న సందేశాత్మక ప్రేమ కథ చిత్రం ప్రేమిస్తున్నా..

*వినూత్న సందేశాత్మక ప్రేమ కథ చిత్రం ప్రేమిస్తున్నా..

*హీరోయిన్ ప్రీతి నేహ అద్భుత నటనను ఆదరించండి..

*చిత్రాన్ని తిలకించం..

*తిరుపతి హీరోయిన్ ను ప్రోత్సహించండి..

*హీరోయిన్ ప్రీతి నేహా తండ్రి కొట్టే శివకుమార్.

తిరుపతి(నేటిధాత్రి)నవంబర్

 

తిరుపతికి చెందిన ప్రీతి నేహా హీరోయిన్ గా తొలిసారి నటించిన, ప్రేమిస్తున్నాచిత్రాన్ని ఆదరించి తగిన ప్రోత్సాహం అందించాలని తిరుపతి జిల్లా ప్రజలకు హీరోయిన్ తండ్రి కొట్టే శివకుమార్ విజ్ఞప్తి చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీటీడీ ఫారెస్ట్ కాంట్రాక్టర్ గా పని చేస్తున్న తాను 20 సంవత్సరములుగా తిరుపతి సుందరీకరణలో భాగస్వాములై స్వామివారికి భక్తులకు అదేవిధంగా తిరుపతి ప్రజలకు సేవ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తన కుమార్తె ప్రీతినేహ బెంగళూరులో బిబిఎ చదువుతూ ఉండగా ఆమె చురుకుతనం, అందం చూసి తొలిసారిగా ప్రేమిస్తున్నా చిత్రంలో హీరోయిన్ గా అవకాశం దక్కిందని వివరించారు. ఇప్పటికే 96చిత్రాలలో బాల నటునిగా నటించిన హీరో సాత్విక్ వర్మ తొలిసారిగా హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో తన కుమార్తెకు కూడా తొలిసారిఅవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. తొలి చిత్రంలో నే తన అద్భుత నటన ప్రదర్శించడంతో మరో రెండు సినిమాలకు హీరోయిన్ గా అవకాశం దక్కిందన్నారు. తిరుపతి గ్రూప్ థియేటర్ శ్రీనివాసతేజ లో ప్రదర్శిస్తున్న ఈ చిత్రాన్ని తిలకించి తన కుమార్తెను ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రేక్షకులు ఆదరించాలని ఆయన కోరారు. చిత్రాన్ని తిలకించిన ప్రతి ఒక్కరు ఏడుస్తూ తమ భావోద్వేగాన్ని పంచే విధంగా చిత్రాన్ని తీయడం జరిగిందన్నారు. గీతం స్కూల్ కరస్పాండెంట్ వెంకటేశ్వర్లు,లు మాట్లాడుతూ నేటి ఆధునిక యుగంలో మానవ సంబంధాలు మృగ్యమై తాత్కాలిక శారీరక వాంఛతో ప్రేమలో పడి పెడదోవ పడుతున్న యువతను చైతన్యం చేసే విధంగా ప్రేమిస్తున్న చిత్రం వినూత్న సందేశాన్ని ఇస్తూ చిత్రీకరించడం జరిగిందన్నారు. వినూత్న ప్రేమ కథ చిత్రాన్ని ఆదరించి తిరుపతి హీరోయిన్ ప్రీతి నేహను ఆదరించాలని ఆయన కోరారు.ఈ సమావేశంలో కొట్టే శివకుమార్ మిత్ర బృందం ఊరు బిండి మునిశేఖర్, ఎల్ సుబ్రహ్మణ్యం చౌదరి, కామసాని నరసింహారెడ్డి,విజయ శేఖర్ , రామకృష్ణ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version