పోలీస్ కిష్టయ్య 16వ వర్ధంతి పోస్టర్ ఆవిష్కరణ..

కాశిబుగ్గలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పోలీస్ కిష్టయ్య 16వ వర్ధంతి పోస్టర్ ఆవిష్కరణ

నేటిధాత్రి, కాశిబుగ్గ

 

వరంగల్ కాశిబుగ్గ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు బిల్ల శివ శంకర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సాధన మలిదశ ఉద్యమ తొలి అమరుడు ముదిరాజ్ ముద్దుబిడ్డ పోలీస్ కిష్టయ్య 16వ వర్ధంతి పోస్టర్ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ ముదిరాజ్ అర్బన్ అధ్యక్షులు బయ్య స్వామి ముదిరాజ్ హాజరై పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ, డిసెంబర్ 1, 2025 సోమవారం ఉదయం 10 గంటలకు అమరవీరుల స్థూపంకి నివాళులర్పించడానికి ముదిరాజ్ బంధువులందరూ అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాశిబుగ్గ ముదిరాజ్ సంఘం ఉపాధ్యక్షులు గౌరబోయిన తిరుపతి ముదిరాజ్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేశబోయిన దేవేందర్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి కూరాకుల చంద్రశేఖర్ ముదిరాజ్, కార్యదర్శి కోడారి నవీన్ ముదిరాజ్, ఆర్గనైజర్ వన్నాల రాజు ముదిరాజ్, కొడారి చిన్న రాజు ముదిరాజ్, చెలక లపెల్లి రాజు ముదిరాజ్, కేశబోయిన రాజు ముదిరాజ్, కేశబోయిన కరుణాకర్ ముదిరాజ్, కేశబోయిన దేవరాజ్ ముదిరాజ్, వన్నాల శంకర్ ముదిరాజ్, బండి బిక్షపతి ముదిరాజ్, వన్నాల వినయ్, కేశబోయిన పవన్ ముదిరాజ్, కేశబోయిన రంజిత్ ముదిరాజ్, గుండ్ర సాయి వర్ధన్ ముదిరాజ్, మరియు కాశిబుగ్గ సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version