కౌన్సిలర్ కుటుంబాన్ని పరామర్శించిన మున్సిపల్ పాలకవర్గం…

కౌన్సిలర్ కుటుంబాన్ని పరామర్శించిన మున్సిపల్ పాలకవర్గం

పరకాల,నేటిధాత్రి

 

పట్టణానికి చెందిన 17వ వార్డు కౌన్సిలర్ బొచ్చు సుభద్ర సాల్మన్ తల్లి కుమ్మరి ఎల్లమ్మ ఇటీవల మరణించారు.ఈ నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో పాలకవర్గ సభ్యులు ఆమె స్వగ్రామమైన మాదన్నపేటకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ సందర్భంగా చైర్మన్ సునీల్ కుమార్ మృతురాలి కుటుంబానికి సానుభూతి తెలిపారు.కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఏకు దివ్య విద్యాసాగర్,కౌన్సిలర్లు పొరండ్ల మౌనిక వేణు,గొడుగు రజిత నాగరాజు,పసుల లావణ్య రమేష్,గూడెల్లి సదన్న,ఆకుల లావణ్య శ్రీధర్,కుక్కల విజయ్,కొయ్యడ శ్రీనివాస్, పాలకుర్తి శ్రీనివాస్,సుధమల్ల రమేష్,అల్లే దశరథం,సోషల్ మీడియా కోఆర్డినేటర్ గడ్డం శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

కొట్లాడుకున్న కేసులలో 8 మందికి జైలు శిక్ష.

కొట్లాడుకున్న కేసులలో 8 మందికి జైలు శిక్ష.

కోదాడ, నేటి ధాత్రి:

 

పట్టణంలోని కోమరబండ గ్రామంలో కొట్లాడుకున్న కేసులో 8 మందిలో మొదటి ముద్దాయికి మూడు సంవత్సరాలు జైలు శిక్ష 4500 రూపాయల జరిమానా, మిగిలిన ఏడుగురికి ఒక్కొక్కరికి మూడు సంవత్సరాలు జైలు శిక్ష మరియు 2 500 రూపాయల జరిమానా తీర్పు వెల్లడించిన కోదాడ మొదటి అదనపు న్యాయస్థానం న్యాయమూర్తి మహమ్మద్ ఉమర్ 2017 సంవత్సరం పిబ్రవరి నెలలో కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోమరబండ గ్రామంలోని మద్దెల సరిత భర్త రాజారామ్ ఇచ్చిన ఫిర్యాదు పై అప్పటి ఎస్సై యం.విజయ ప్రకాష్ కేసు నమోదు చేసినారు. కేసు తధానంతరం విచారణ పూర్తి చేసి కేసు అభియోగ పత్రాలను ఆధారాలతో సహా గౌరవ కోదాడ మొదటి అదనపు న్యాయస్థానం నందు ఫైల్ చేయడం జరిగింది. ఈ కేసు విషయంలో కోదాడ మొదటి అదనపు న్యాయస్థానం న్యాయమూర్తి కేసులోని సాక్షాదారాలు పరిశీలించి కందుల గురుస్వామి మూడు సంవత్సరాలు జైలు శిక్ష 4500 రూపాయల జరిమానా అతని వర్గానికి చెందిన మిగిలిన ఏడుగురు కందుల నాగార్జున, కందుల రామకృష్ణ, కందుల నవీన్, కందుల శ్రీకాంత్, కందుల వెంకటేష్ కందుల శోభ, చెవుల వీరబాబు లకు ఒక్కొక్కరికి మూడు సంవత్సరాలు జైలు శిక్ష 2 500 రూపాయల జరిమానా అని తీర్పును వెలువరించినారు.ఈ కేసులలో న్యాయస్థానం తరఫున ప్రాసిక్యూషన్ తరపున మహమ్మద్. గౌస్ పాషా ఏపీపీ వాదనలు వినిపించినారు. అందుకు కోర్టు కానిస్టేబుల్ పల్లా నరేష్ సహకరించినారు. ఈ వివరాలను కోదాడ రూరల్ ఎస్సై సి.హెచ్. గోపాల్ రెడ్డి వెల్లడించినట్లు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version