సూపర్‌స్టార్‌తో భేటీపై సిమ్రన్‌ ట్వీట్‌..

 సూపర్‌స్టార్‌తో భేటీపై సిమ్రన్‌ ట్వీట్‌

 

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌కు కలుసుకున్నప్పటి చిత్రాన్ని నటి సిమ్రన్‌ తన ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌కు కలుసుకున్నప్పటి చిత్రాన్ని నటి సిమ్రన్‌ తన ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. కోలీవుడ్‌ సీనియర్‌ నటి సిమ్రన్‌ ఇటీవల  సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ను ఆయన స్వగృహంలో కలుసుకున్నారు. రజనీకాంత్‌తో ఉన్న ఫొటోను ఎక్స్‌లో పోస్ట్‌ చేసిన సిమ్రన్‌… ‘కొన్ని ఘటనలు కాలం మారినా చెరిగిపోనివి’ అనే కామెంట్‌ జతచేశారు.

సిమ్రన్‌ చివరగా ‘టూరిస్ట్‌ ఫ్యామిలీ’ చిత్రంలో నటించారు. చిన్న బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ విజయం నమోదు చేసింది. మరోవైపు రజనీకాంత్‌ నటించిన ‘కూలీ’ చిత్రం ఈ నెల 14వ తేది విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి విజయం నమోదు చేసింది.

మ‌రో సినిమా.. లైన్లో పెట్టిన సూప‌ర్‌స్టార్‌!

మ‌రో సినిమా.. లైన్లో పెట్టిన సూప‌ర్‌స్టార్‌!

 

 

 

కుర్ర హీరోలను మించి వ‌రుస సినిమాల‌ను లైన్‌లో పెడుతూ పుల్ స్వింగ్‌లో ఉన్నాడు సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్.

కుర్ర హీరోలను మించి వ‌రుస సినిమాల‌ను లైన్‌లో పెడుతూ పుల్ స్వింగ్‌లో ఉన్నాడు సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ (Rajinikanth) ఇప్ప‌టికే లోకేశ్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన కూలీ ఆగ‌ష్టులో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుండ‌గా నెల్స్ డైరెక్ష‌న్‌లో జైల‌ర్2 షూటింగ్‌లో ఉంది. ఇది ఇలా ఉండ‌గానే తాజాగా మ‌రో చిత్రాన్ని లైన్‌లో పెట్టాడు. త‌మిళ ఆగ్ర హీరోలు అజిత్‌తో తునీవు, వాలిమై, పింక్ రిమేక్ సినిమాల‌తో పాటు ప్ర‌స్తుతం విజ‌య్‌తో జ‌న నాయ‌గ‌న్ సినిమ రూపొందిస్తున్న హెచ్ వినోద్ (H. Vinoth) ద‌ర్శ‌క‌త్వంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్ తన తదుపరి చిత్రం చేయనున్నట్టు కోలీవుడ్‌ వర్గాల సమాచారం.

వీరిద్దరి కాంబినేషన్‌లో రూపుదిద్దుకునే ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో వెల్లడి కానున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రజనీకాంత్‌.. యువ దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో ‘కూలీ’లో నటించారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టులో విడుదలకానుంది. అలాగే, నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ డైరెక్షన్‌లో ‘జైలర్‌’ వంటి మెగా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ మూవీకి సీక్వెల్‌గా రూపొందే ‘జైలర్‌-2’లో రజనీకాంత్‌ నటిస్తున్నారు.

అదేవిధంగా హెచ్‌.వినోద్‌ కూడా అగ్రహీరో విజయ్‌ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత రజనీ – హెచ్‌.వినోద్‌ కలిసి పనిచేయనున్నట్టు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. ఈ విషయంపై రజనీతో హెచ్‌.వినోద్‌ రెండుసార్లు కలిసి చర్చించడంతో వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ చిత్రం రావడం ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదిలాఉంటే స‌రిపోదా శ‌నివారం వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్‌ అందించిన వివేక్ అత్రేయ సైతం ర‌జ‌నీతో సినిమా కోసం చ‌ర్చలు జ‌రుపుతున్న‌ట్లు స‌మాచారం.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version