సూపర్‌స్టార్‌తో భేటీపై సిమ్రన్ ట్వీట్
సూపర్ స్టార్ రజనీకాంత్‌కు కలుసుకున్నప్పటి చిత్రాన్ని నటి సిమ్రన్ తన ఎక్స్‌లో పోస్ట్ చేశారు
సూపర్ స్టార్ రజనీకాంత్‌కు కలుసుకున్నప్పటి చిత్రాన్ని నటి సిమ్రన్ తన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కోలీవుడ్ సీనియర్ నటి సిమ్రన్ ఇటీవల సూపర్ స్టార్ రజనీకాంత్‌ను ఆయన స్వగృహంలో కలుసుకున్నారు. రజనీకాంత్‌తో ఉన్న ఫొటోను ఎక్స్‌లో పోస్ట్ చేసిన సిమ్రన్… ‘కొన్ని ఘటనలు కాలం మారినా చెరిగిపోనివి’ అనే కామెంట్ జతచేశారు.
సిమ్రన్ చివరగా ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ చిత్రంలో నటించారు. చిన్న బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ విజయం నమోదు చేసింది. మరోవైపు రజనీకాంత్ నటించిన ‘కూలీ’ చిత్రం ఈ నెల 14వ తేది విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి విజయం నమోదు చేసింది.