సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సేవలు అభినందనీయం…
కల్వకుర్తి/ నేటి ధాత్రి :
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో కంటి సమస్యలతో బాధపడుతున్న ప్రతి పేదవాడికి అండగా ఉండి,వారికి చూపును అందించే ప్రయత్నమే ఈ కార్యక్రమం.. సుంకిరెడ్డీ రాఘవేందర్ రెడ్డి ప్రారంభమైన ఐక్యత ఫౌండేషన్ ఉచిత కంటి వైద్య శిభిరం సేవలు ముఖ్య అతిథులుగా హాజరైన కల్వకుర్తి కోర్టు సీనియర్ జడ్జి శ్రీమతి శ్రీదేవి ప్రముఖ డా.దామోదర్ రెడ్డి మొదటి రోజు 800 మందికి పైగా శిబిరానికి హాజరుకాగా 600 మందికిపైగా కంటి పరీక్షలు, 35 మందిపేషెంట్లు కంటి శుక్లాల సర్జరీలకి ఎంపిక. 300 పైగా ఉచిత కంటి అద్దాల పంపిణి… శనివారం కల్వకుర్తి పట్టణ కేంద్రంలోని CKR ఫంక్షన్ హాల్లో…ఐక్యత ఫౌండేషన్ చైర్మన్,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు& TASK-C.O.O సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సహకారంతో ఐక్యత ఫౌండేషన్& శంకర నేత్రాలయ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిభిరం సేవలు స్థానిక ప్రముఖ డా.దామోదర్ రెడ్డి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించగా,సీనియర్ జడ్జి శ్రీమతి శ్రీదేవి శిబిరాన్ని సందర్శించి ఉచిత కంటి వైద్య శిభిరం సేవలను పరిశీలించి,అద్దాల పంపిణి,కంటి సర్జరీలకు సంబంధించిన పలు విషయాలు వైద్యుల బృందంతో చర్చించి వారిని అభినందించారు.ఈ సందర్భంగా సీనియర్ జడ్జి శ్రీమతి శ్రీదేవి గారు మాట్లాడుతూ… సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సేవలు అభినందనీయం అని,గత కొన్ని నెలలుగా నేను ఎక్కడ చూసినా సుంకిరెడ్డి సామాజిక సేవలు గమనిస్తున్నానని,వాటికి సంబంధించిన పలు గురించి కూడా నేను తెలుసుకున్నానని,వారికి సమాజం పట్ల,ప్రజలకు ఏదో చెయ్యాలనే సేవా దృక్పథానికి అభినందిస్తున్నానని, సుంకిరెడ్డి లాగే ప్రతి ఒక్కరు సమాజం పట్ల ఎంతో కొంత సేవ దృక్పథాన్ని అలవర్చుకోవాలని,పేదలకు ఉచిత కంటి సర్జరీలు,అద్దాల పంపిణి వంటి వ్యయంతో కూడుకున్న సేవలను పేద ప్రజలకి అందిస్తున్నందుకు వారిని ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తు,ఒక గొప్ప కార్యక్రమానికి ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు…డా.దామోదర్ రెడ్డి మాట్లాడుతూ… కల్వకుర్తి ప్రాంతంలో ఇంత గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టి,పేదలకు ఉచితంగా సర్జరీలు చేసి,వారికి అన్ని విధాలుగా అండగా ఉంటున్నారని వారి గొప్ప సేవలు కల్వకుర్తి ప్రజలకు అందిస్తున్నందుకు ఈ సందర్భంగా సుంకిరెడ్డి అభినందనలు తెలియజేస్తు,గొప్ప కార్యక్రమానికి ముఖ్య అతిథిగ ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు…సుంకిరెడ్డి మాట్లాడుతూ.. పేద ప్రజలు తమ తమ ఆర్థిక ఇబ్బందులు,పలు కారణాల వలన కంటి సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారని, నియోజకవర్గంలో కంటి సమస్యతో ఇబ్బంది పడుతున్న ప్రతి పేదవాడికి తన వంతు ప్రయత్నంగా అండగా ఉండటానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టానని,మా కార్యక్రమం ప్రారంభోత్సవానికి విచ్చేసి,తమ విలువైన సమయాన్ని కేటాయించి,పలు సూచనలు అందించిన సీనియర్ జడ్జి శ్రీమతి శ్రీదేవి మేడమ్ స్థానిక సీనియర్ డా.దామోదర్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు…ఈ కార్యక్రమంలో…కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పవన్ కుమార్ రెడ్డి గారు,యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు బీస బాలరాజు,యువజన నాయకులు పర్శపాకుల రమేష్,ఐక్యత ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.