నాకు తెలియదు.. సునేత్రకు డిప్యూటీ సీఎంపై శరద్ పవార్..

నాకు తెలియదు.. సునేత్రకు డిప్యూటీ సీఎంపై శరద్ పవార్

 

సునేత్ర ప్రమాణస్వీకార కార్యక్రమంపై శరద్ పవార్ బారామతిలో జరిగిన మీడియా సమావేశంలో స్పందించారు. శనివారం సాయంత్రం ప్రమాణస్వీకారం ఉంటుందనే విషయం మీడియా ద్వారానే తనకు తెలిసిందని చెప్పారు.

ముంబై: విమాన ప్రమాదంలో ఎన్సీపీ నేత అజిత్ పవార్ (Ajit Pawar) ఇటీవల కన్నుమూయడంతో ఆయన భార్య సునేత్రా పవార్ (Sunetra Pawar) మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే దీనిపై తనకు ఎలాంటి సమాచారం లేదని అజిత్ పవార్ బాబాయ్, ఎన్‌సీపీఎస్‌పీ చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar) తెలిపారు. ఎన్‌సీపీ, ఎన్‌సీపీఎస్‌పీ విలీనం కానున్నాయనే ఊహాగానాల నేపథ్యంలో ‘మహాయుతి’ సర్కార్‌లో ఉప ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టేందుకు సునేత్ర సిద్ధమవుతుండటం మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
ఎలాంటి సమాచారం లేదు

సునేత్ర ప్రమాణస్వీకార కార్యక్రమంపై శరద్ పవార్ బారామతిలో జరిగిన మీడియా సమావేశంలో స్పందించారు. శనివారం సాయంత్రం ప్రమాణస్వీకారం ఉంటుందనే విషయం మీడియా ద్వారానే తనకు తెలిసిందని చెప్పారు. ‘ప్రమాణస్వీకారంపై నాకు ఎలాంటి సమాచారం లేదు’ అని పవార్ తెలిపారు. పవార్ కుటుంబ సభ్యుల నుంచి ఎవరైనా ప్రమాణస్వీకారానికి హాజరవుతారా అనేది కూడా తనకు తెలియదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అజిత్ పవార్ వారసుని ఎన్నిక ప్రక్రియ నుంచి మిమ్మల్ని దూరంగా ఉంచారని అనుకుంటున్నారా అనే ప్రశ్నకు సైతం ఆయన తనకు తెలియదని సమాధానమిచ్చారు. రాజకీయాలు వేరు, కుటుంబం వేరనే అభిప్రాయం పవార్ మాటల్లో వ్యక్తమైంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version