పుట్టిన ఆడబిడ్డకి 5016రూ. లు డిపాజిట్.
సి ఆర్ పల్లె గ్రామపంచాయతీ పాలక వర్గం తీర్మానం.
చిట్యాల, నేటిదాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని చింతకుంట రామయ్య పల్లె గ్రామ పంచాయితీ పాలకవర్గం సర్పంచి మటిక సుజాత రవీందర్ అధ్యక్షతన మంగళవారం రోజున గ్రామపంచాయతీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది, ఈ సమావేశంలో గ్రామ ఆడపిల్లల కోసం వినూత్న తీర్మానం చేసింది. గ్రామంలో ఓటరుగా కలిగి ఉండే ఈ ఊరికి కోడలు వచ్చిన ఆడబిడ్డకు ఆడపిల్ల పుట్టినప్పటినుంచి 21వ రోజు లోపు పోస్ట్ ఆఫీస్ లో సుకన్య సమృద్ధి యోజన కింద 5016 రూపాయలు డిపాజిట్ చేయడం జరుగుతుందని తెలిపారు, ఇది గ్రామపంచాయతీ పాలకవర్గం సమిష్టిగా తీసుకున్న నిర్ణయము అని తెలిపినారు
