చెరుకు రసం తీయడానికి వినూత్న దేశీ టెక్నిక్ వైరల్

చెరుకు రసం తీయడానికి సూపర్ టెక్నిక్.. ఇంత కంటే స్వచ్ఛమైన చెరుకు రసం ఉండదేమో..

 

 

అవసరం అనేది ఎన్నో నూతన అవిష్కరణలు చేయిస్తుంది. మెదడుకు పదును పెట్టి సరికొత్త టెక్నిక్ కనిపెట్టేలా పురిగొల్పుతుంది. పెద్దగా ఖర్చుపెట్టకుండా, మెషిన్ల అవసరం లేకుండా కొందరు ఉపయోగించే పద్ధతులు అద్భుతంగా కనబడతాయి.

అవసరం అనేది ఎన్నో నూతన అవిష్కరణలు చేయిస్తుంది. మెదడుకు పదును పెట్టి సరికొత్త టెక్నిక్ కనిపెట్టేలా పురిగొల్పుతుంది. పెద్దగా ఖర్చుపెట్టకుండా, మెషిన్ల అవసరం లేకుండా కొందరు ఉపయోగించే పద్ధతులు అద్భుతంగా కనబడతాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో దేశీ టెక్నిక్‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి (viral desi hacks). తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. చెరుకు రసం తీయడానికి వారు ఉపయోగిస్తున్న పద్ధతి చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది (Sugarcane juice viral video).

nguyenlethao1982 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఒక కుటుంబం చెరకు రసం తీయడానికి వినూత్న టెక్నిక్‌ను ఉపయోగిస్తోంది. చెరుకు రసం తీయడానికి మనమందరం పెద్ద యంత్రాలను ఉపయోగిస్తుంటాం. అలాంటి వనరులు లేకపోవడంతో ఆఫ్రికాకు చెందిన ఓ గిరిజన కుటుంబం కర్రలను ఉపయోగించి చెరుకు రసాన్ని తీసున్నారు (traditional juice making). రెండు కర్రలను చెట్టుకు కట్టి ఆ రెండు కర్రల మధ్య చెరుకును ఉంచుతున్నారు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version