అంతా రాజకీయాల కోసమే.. పరకామణి కేసుపై జగన్ కీలక వ్యాఖ్యలు
పరకామణి వివాదం ఆశ్చర్యం కలిగించే కేసు అని మాజీ సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో పారదర్శక వ్యవస్థ సృష్టిస్తే తమపై నిందలా అంటూ మండిపడ్డారు.
పరకామణి వివాదం ఆశ్చర్యం కలిగించే కేసు అని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Former CM YS Jaganmohan Reddy) వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. పరకామణి కేసులో దొరికింది 9 డాలర్లు అని.. ప్రాయశ్చిత్తంగా రూ.14 కోట్ల ఆస్తులను టీటీడీకి ఇచ్చారని తెలిపారు. దొంగ దొరకగానే కేసు నమోదైందని.. తిరుపతి కోర్టులో చార్జ్‌షీట్ వేశారని తెలిపారు. మెగా లోక్ అదాలత్‌లో కేసును పరిష్కరించారని అన్నారు. జ్యుడిషియల్ విచారణ జరిగాక.. మళ్లీ కేసును తెరపైకి తెచ్చారని మండిపడ్డారు.
