ప్రజలు ఆశీర్వదిస్తే అభివృద్ధి చేసి చూపెడతా..

ప్రజలు ఆశీర్వదిస్తే అభివృద్ధి చేసి చూపెడతా..

ఎరవెల్లి అరుణ్ రావు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి

భూపాలపల్లి నేటిధాత్రి

మున్సిపల్ సాధారణ ఎన్నికలలో భాగంగా 3వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఎరవెల్లి జగపతి అరుణ్ రావు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో కౌన్సిలర్ గా పోటీ చేసి ఓడిపోయాను కావున ఎప్పుడు నాకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కాంగ్రెస్ పార్టీ నుండి కౌన్సిలర్ అభ్యర్థిగా టికెట్లు ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ మూడు సంవత్సరాలు అధికారం ఉంటుంది ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు డిసిసి జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్ ఆశీస్సులతో సిఆర్ నగర్ బాంబులగడ్డ హనుమాన్ నగర్ ను అభివృద్ధి చేస్తాను నేను ఈ కాలనీ బిడ్డను నన్ను ఆశీర్వదించండి ఇతర పార్టీ నాయకులు కాలనీకి ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదు. కావున మూడో వార్డు ప్రజలందరూ అందరూ నన్ను ఆశీర్వదించి చేయి గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించండి అభివృద్ధి చేసి చూపిస్తాను. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

బ్లడ్ రోజస్.. ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది…

బ్లడ్ రోజస్.. ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది

 

ధర్మ కీర్తి రాజు, అప్సర రాణి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్లడ్ రోజస్’ .

టీబీఆర్ సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై కె. నాగన్న, కె. లక్ష్మమ్మ సమర్పణలో హరీష్ కమర్తి నిర్మాతగా, ఎల్లప్ప కో–ప్రొడ్యూసర్‌గా తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ ‘బ్లడ్ రోజస్’ (Blood Roses) ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు వ‌స్తోంది. ఎంజిఆర్ రచన, దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ధర్మ కీర్తి రాజు, అప్సర రాణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఇటీవల విడుదలైన ‘బ్లడ్ రోజస్’ ట్రైలర్‌ను నటుడు రాజేంద్రప్రసాద్ ఆవిష్కరించగా, ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తోంది. తాజాగా ఈ చిత్ర యూనిట్‌కు ప్రముఖ నటుడు బాబు మోహన్ (Babu Mohan) ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

 మాదాల రంగారావు మనవడు హీరోగా సినిమా…

 మాదాల రంగారావు మనవడు హీరోగా సినిమా

 

మాదాల కుటుంబం నుండి మూడో తరం హీరో వస్తున్నాడు. మాదాల రంగారావు మనవడు, మాదాల రవి కొడుకు సన్నీ ‘ఓ టార్చర్ ప్రేమ’ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు.

తెలుగు సినీ యవనికపై విప్లవ కేతనం ఎగరేసిన వ్యక్తి రెడ్ స్టార్ మాదాల రంగారావు (Madala Rangarao). వెండితెరపై విప్లవశంఖం పూరించి, యువతరం ధియేటర్ల వైపు కదిలేలా చేశారాయన. నటుడిగానే కాకుండా నిర్మాతగానూ తన సత్తాను చాటారు. విప్లవశంఖం, యువతరం కదిలింది, ఎర్రమల్లెలు, మహాప్రస్థానం, విప్లవ శంఖం, నవోదయం, ప్రజాశక్తి’ వంటి ఎన్నో విప్లవాత్మక చిత్రాలలో ఆయన నాయకుడిగా నటించారు. విశేషం ఏమంటే వైద్యవృత్తిని చదివినా ఆయన కుమారుడు మాదాల రవి (Madala Ravi) సైతం తండ్రి బాటలో నటుడిగా మారారు. ‘నేను సైతం, మా ఇలవేల్పు, బ్రోకర్ 2, పంచముఖి’ వంటి చిత్రాలలో నటించారు. కొన్ని సినిమాలను నిర్మించారు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version