బ్లడ్ రోజస్.. ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది
ధర్మ కీర్తి రాజు, అప్సర రాణి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్లడ్ రోజస్’ .
టీబీఆర్ సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై కె. నాగన్న, కె. లక్ష్మమ్మ సమర్పణలో హరీష్ కమర్తి నిర్మాతగా, ఎల్లప్ప కో–ప్రొడ్యూసర్‌గా తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ ‘బ్లడ్ రోజస్’ (Blood Roses) ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఎంజిఆర్ రచన, దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ధర్మ కీర్తి రాజు, అప్సర రాణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఇటీవల విడుదలైన ‘బ్లడ్ రోజస్’ ట్రైలర్‌ను నటుడు రాజేంద్రప్రసాద్ ఆవిష్కరించగా, ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తోంది. తాజాగా ఈ చిత్ర యూనిట్‌కు ప్రముఖ నటుడు బాబు మోహన్ (Babu Mohan) ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.
