నీ పక్కన లేకపోవడం ఇదే మొదటిసారి…      

నీ పక్కన లేకపోవడం ఇదే మొదటిసారి      

 

మహేశ్‌బాబు కుమారుడు గౌతమ్‌ పుట్టినరోజు నేడు. దీనిని ఉద్దేశించి మహేశ్‌ ట్వీట్‌ చేశారు

మహేశ్‌బాబు (Mahesh Babu) కుమారుడు గౌతమ్‌ Gowtham Ghattamaneni) పుట్టినరోజు నేడు. దీనిని ఉద్దేశించి మహేశ్‌ ట్వీట్‌ చేశారు. ‘ఈ బర్త్‌డేకి నిన్ను మిస్‌ అవుతున్నా’ అంటూ కుమారుడు గౌతమ్‌ను ఉద్దేశించి పోస్టు పెట్టారు.  ‘ప్రతిసారీ నీ పుట్టినరోజు నీ పక్కనే ఉంటాను.. ఈసారి లేకపోవడం కాస్త బాధగా ఉంది’ అని మహేశ్‌ ఎమోషనల్‌ అయ్యారు. గతంలో దిగిన ఫొటోను షేర్‌ చేశారు. 19వ వసంతంలోకి అడుగుపెట్టిన గౌతమ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ‘నా ప్రేమ నీకెప్పుడూ తోడుగా ఉంటుంది. ఎప్పటికీ ఇలాగే ప్రకాశిస్తూ.. మరింత ఎత్తుకు ఎదగాలి’ అని విషెస్‌ తెలియజేశారు. మహేశ్‌ అభిమానులు పలువురు నెటిజన్లు గౌతమ్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు.ప్రస్తుతం మహేశ్‌ ‘ఎస్‌ఎస్‌ఎంబీ29’ సినిమా షూటింగ్‌లో ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇది. ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.    ఇప్పటికే మూడు షెడ్యూళ్ల షూటింగ్‌ పూర్తి చేసుకుంది. కొత్త షెడ్యూల్‌ను నైరోబి, టాంజానియాల్లో ప్లాన్‌ చేస్తున్నారు మేకర్స్‌. 

ఎస్‌ఎస్‌ఎంబీ29.. రాజమౌళి ఏం చేస్తున్నారంటే..

‘ఎస్‌ఎస్‌ఎంబీ29’.. రాజమౌళి ఏం చేస్తున్నారంటే..

సూపర్‌స్టార్‌ మహేశ్‌ దర్శకుడు ఎస్‌ఎస్‌.రాజమౌళి కాంబోతో ఓ భారీ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎస్‌ఎస్‌ఎంబీ 29 వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌కు కాస్త గ్యాప్‌ ఇచ్చారు.సూపర్‌స్టార్‌ మహేశ్‌ (Mahesh BabU) దర్శకుడు ఎస్‌ఎస్‌.రాజమౌళి (SS Rajamouli) కాంబోతో ఓ భారీ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘ఎస్‌ఎస్‌ఎంబీ 29’ (SSMB 29) వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌కు కాస్త గ్యాప్‌ ఇచ్చారు. ప్రస్తుతం మహేశ్‌ టూర్‌లో ఉన్నారు. కానీ వెనక జరగాల్సిన పనులు జరుగుతూనే ఉన్నాయి. రాజమౌళి ఫామ్‌హౌస్‌లో రికార్డింగ్‌ మొదలుపెట్టారు కీరవాణి. మరోవైపు అల్యూమినియం ఫ్యాక్టరీలో నెలకొల్పిన సెట్‌లో వందమందికిపైగా ఫైటర్స్‌ ఓ భారీ ఫైట్‌కు సంబంధించిన రిహార్సెల్‌ జరుగుతున్నాయని చిత్ర వర్గాల నుంచి సమాచారం అందింది. త్వరలో ప్రారంభం కాబోయే షెడ్యూల్‌లో సినిమాకు కీలక పొరాట ఘట్టాలను తెరకెక్కించనున్నారట. దానికి సంబంధించే ఇప్పుడు రిహార్సెల్స్‌ జరుగుతున్నాయట. ఇక మహేశ్‌ శ్రీలంక టూర్‌ పూర్తి చేసుకుని రాగానే తాజా షెడ్యూల్‌ మొదలు పెడతారని తెలిసింది. 

ఇటీవల ఈ చిత్రం గురించి ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న పృథ్వీరాజ్‌ సుకుమార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

‘రాజమౌళి చిత్రాలు భారీగా ఉంటాయి. ‘ఎస్‌ఎస్‌ఎంబీ29’ కూడా అలాగే ఉంటుంది. ఇదొక అద్భుత దృశ్య కావ్యం. ప్రతిఒక్కరినీ అలరించేలా కథను చెప్పడంలో ఆయన ఎక్స్‌పర్ట్‌. ఈ సినిమాను విజువల్‌ ట్రీట్‌గా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటివరకూ ఎవరూ ఊహించని రీతిలో ఈ కథను రాజమౌళి తీర్చిదిద్దుతున్నారు’ అన్నారు. ప్రస్తుతం షూటింగ్‌కు కాస్త విరామం ఇచ్చారు. విహారయాత్రలో భాగంగా మహేశ్‌బాబు కుటుంబంతో కలిసి శ్రీలంక వెళ్లారు. ఆగస్టులో తిరిగి షూటింగ్‌ ప్రారంభిస్తారని తెలిసింది. మొదట అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం జులైలో టీమ్‌ అంతా కెన్యాకు వెళ్లాల్సి ఉంది. అక్కడి అంబోసెలి నేషనల్‌ పార్క్‌లో కీలక సన్నివేశాల చిత్రీకరణ చేయాలనుకున్నారు. ఈ షెడ్యూల్‌లో మహేశ్‌, ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్‌ సుకుమారన్‌తో మరికొందరు తారలు పాల్గొనాల్సి ఉంది. పలు కారణాల వల్ల తాజా షెడ్యూల్‌ను నిలిపివేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version