ఎన్నికల ఖర్చులపై అభ్యర్థులకు కఠిన సూచనలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి, జహీరాబాద్ ఎన్నికల ప్రచార ఖర్చులను అభ్యర్థులు పకడ్బందీగా నమోదు చేయాలని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు రాకేష్ సూచించారు. 5 వేలకు పైగా జనాభా గల గ్రామపంచాయతీలలో సర్పంచి అభ్యర్థికి రూ. 2.5 లక్షలు, వార్డు సభ్యులకు రూ. 50 వేలు, 5 వేల లోపు జనాభా గల గ్రామపంచాయతీ సర్పంచికి రూ. 1.5 లక్షలు, వార్డు సభ్యులకు రూ.30 వేలు వ్యయ పరిమితిగా నిర్ణయించారు. రెండవ విడత ఎన్నికలు జరుగుతున్న సంగారెడ్డి జాహీరాబాద్ మొగుడంపల్లి నాల్కల్ ఝరాసంగం మండలాలకు సంబంధించి డిసెంబర్ 8, 10, 12 తేదీలలో మూడుసార్లు అభ్యర్థుల ఖర్చుల లెక్కలను పరిశీలిస్తారు. హాజరుకాని అభ్యర్థులకు నోటీసులు జారీ చేసి, సరైన సంజాయిషీ లేనిచో ఎన్నికల నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటారు. అభ్యర్థులు లేదా వారి ప్రతినిధులు తప్పనిసరిగా హాజరుకావాలి.
